వెంకీ-తేజ నిజాలు దాచిపెడుతున్నారా?

Updated By VankayaMon, 04/16/2018 - 16:19
Venky, teja will not reveal truth ?

చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందాల్సిన ఆటా నాదే వేటా నాదే ఎటువంటి అప్ డేట్స్ లేక సైలెంట్ అయిపోయింది. ఒకపక్క తేజ ఎన్టీఆర్ బయోపిక్ సన్నాహాల్లో బిజీ గా ఉండగా మరోపక్క వెంకటేష్ దిల్ రాజు బ్యానర్ లో వరుణ్ తేజ్ తో కలిసి నటించే మల్టీ స్టారర్ సెట్స్ లో త్వరలో జాయిన్ కాబోతున్నాడు. ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)అనే పేరు కూడా ఖరారు చేసారు.

దర్శకుడు అనిల్ రావిపూడి. దీని తర్వాత ఒక నెల గ్యాప్ లోనే నాగచైతన్య తో బాబీ దర్శకత్వంలో రూపొందే మల్టీ స్టారర్ లో కూడా వెంకీ అడుగు పెట్టబోతున్నాడు. ఈ నేపధ్యంలో ఆటా నాదే వేటా నాదే అటకెక్కినట్టే అని ఫిలిం నగర్ టాక్. నిర్మాత సురేష్ బాబు దీన్ని అఫీషియల్ గా ప్రకటించనప్పటికీ ఇదీ నిజమని సమాచారం.

ఆటా నాదే వేటా నాదే స్క్రిప్ట్ కోసం చాలా పెద్ద కసరత్తు జరిగింది. ముగ్గురు రచయితలు మారారు. చివరికి నేనే రాజు నేనే మంత్రి ఫేం లక్ష్మి భూపాల ఫైనల్ వెర్షన్ ఇచ్చినప్పటికీ అది కూడా కార్య రూపం దాల్చలేకపోయింది. కారణం వెంకటేష్ తేజల మధ్య సరైన అండర్ స్టాండింగ్ కుదరకపోవడమే అని ఇన్ సైడ్ టాక్. తాను లేవనెత్తిన సందేహాలకు తేజ బదులు చెప్పడానికి ఇష్టపడకపోవడం వల్లే వెంకీ డ్రాప్ అయినట్టు గాసిప్ ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో కూడా నేనే రాజు నేనే మంత్రి ముందు హీరో రాజ శేఖర్ తో చేద్దామనుకున్న తేజ ఏదో క్లాష్ వల్ల రానాకు షిఫ్ట్ అయ్యాడు. అప్పుడు అహం అనే టైటిల్ కూడా పెట్టుకున్నారు.

మళ్ళి ఇప్పుడు వెంకటేష్ తో కూడా ఏదో సమస్య తేజకు వచ్చినట్టు ఉందని సమాచారం. మొత్తానికి ఎవరికి వారు ఏమి తెలియనట్టు సైలెంట్ గా ఉన్నా ఆటా పాటా మొత్తం అటక ఎక్కినట్టు ఫైనల్ టాక్. ఆరు నెలల సమయం, నెల రోజుల పాటు ఈ సినిమా కోసం చేసిన ఆడిషన్లు, పెట్టిన ఖర్చు, రెమ్యునరేషన్లు అడ్వాన్సులు అన్ని కర్పూరమే అని టాక్. మరి తేజ నో లేదా వెంకీ వీటికి క్లారిటీ ఇస్తే బెటర్


    
Click here to Reply or Forward
11.68 GB (77%) of 15 GB used
Manage
Terms - Privacy
Last account activity: 0 minutes ago
Open in 1 other location  Details
 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE