నయన్ పెళ్లి వయసు గుర్తుచేసిన లవర్

Updated By VankayaThu, 05/17/2018 - 17:24
Nayan Tara And Vignesh ShivN

పైకి గట్టిగా చెప్పుకోవడం లేదు కాని హీరొయిన్ నయనతార, దర్శకుడు విజ్ఞేశ్ శివన్ మధ్య ప్రేమ కథ ఎప్పటి నుంచో ఉంది. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం, వేడుకలకు కలిసే వెళ్ళడం ఇలా చాలానే చేసారు. కాని పెళ్లి విషయం మాత్రం ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు. ఎంత తిరిగినా తమ మధ్య ఉన్న అనుబంధం గురించి మాత్రం పబ్లిక్ గా ఎప్పుడు ఒప్పుకోలేదు ఈ జంట.

ఈ దిశగా అడుగులు వేస్తున్నాడు శివన్. ఇవాళ నయనతార కొత్త సినిమా కొలమావు కోకిల నుంచి కళ్యాణ వయసు అనే ఆడియో ట్రాక్ ఒకటి ఆన్ లైన్ లో విడుదల చేసారు. పాట మొదటి రెండు అక్షరాలు చూస్తేనే అది పెళ్లి పాట అని ఈజీగా అర్థమవుతుంది. దీన్ని తన ట్విట్టర్ లో షేర్ చేసిన విజ్ఞేశ్ శివన్ ఆ పోస్ట్ కింద నాకు కూడా పెళ్లి వయసు వచ్చిందిరా అంటూ పోస్ట్ చేయటం చూసి ఫాన్స్ సైతం షాక్ తిన్నారు.

ఇది పబ్లిక్ గా ప్రపోజ్ చేయటం కిందకే వస్తుంది. విజ్ఞేశ్ శివన్ పెట్టిన లైన్ ప్రకారం చూసుకుంటే పెళ్లి వయసు వచ్చింది కాబట్టి మనం త్వరపడాలి అని చెప్పెసినట్టే. ఇంకా దీనికి నయన్ స్పందించలేదు. విజ్ఞేశ్ ఇలా ఎంత మొత్తుకున్నా లాభం లేదు. కారణం నయన్ కున్న సినిమా కమిట్మెంట్స్. చిరంజీవి సైరా తో పాటు తమిళ్ లో నాలుగైదు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఉన్న నయనతార అవి పూర్తి చేయాలంటే ఎంత లేదన్నా కనీసం ఏడాది పైగా పడుతుంది.

సమంతా తరహాలో పెళ్లి చేసుకుని కంటిన్యూ చేయొచ్చుగా అంటే నయన్ వినటం లేదట. సినిమాలన్నీ పూర్తి చేసాక వచ్చే సంవత్సరం పెళ్లి గురించి ఆలోచిద్దాం అని చెప్పాక విజ్ఞేశ్ శివన్ విరహ గీతాలు ఓ రేంజ్ లో పాడుకుంటున్నాడు. దానికి తోడు నయన్ ఇలా పెళ్లి పాటల్లో కనిపిస్తూ ఉంటే పాపం కాలకుండా ఎలా ఉంటుంది.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE