సాక్షిలో మార్పెప్పుడు...

Updated By VankayaTue, 02/13/2018 - 15:41
When will changes happen in Sakshi...

నేను జ‌ర్న‌లిజంలో ప‌ట్ట భ‌ద్రుణ్ని కొన్నిటీవీ ఛాన‌ళ్ల‌లో చేసిన అనుభ‌వం ఉంది. ప‌నిలో ప‌నిగా అవ‌స‌రాల రిత్యా   వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్. జ‌గ‌న్ కు  నేను హార్డ్ కోర్ ఫ్యాన్ ను అందుకే సాక్షి టీవీలో జాబ్ ఉందంటే రిఫ‌రెన్స్ తో అక్క‌డికి వెళ్లా అది బంజారాహిల్స్ రోడ్‌నెం.1 జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్  సాక్షి ఆఫీస్ చూడ‌టానికి కార్పొరేట్ ఆఫీస్ ను త‌ల ద‌న్నేలా ఉండే అద్దాల మేడ‌ చుట్ట‌ప‌క్క‌ల వాతావ‌ర‌ణం ఆహ్లాద‌క‌రంగా ఉంది ఎప్ప‌టి నుంచి సాక్షిలో ఉద్యోగం చేయాలే కోరిక అందుకే నా క‌ల‌ల సామ్రాజ్యంలోకి అడుగుపెట్టినంత క‌లిగింది.

క్ష‌ణం ఆలస్యం చేయ‌కుండా లోప‌లికి వెళ్లి అపాయింట్మెంట్ లెట‌ర్ తీసుకొని వెళ్లాల‌ని సిద్ధ‌మ‌య్యా అంతే సాక్షి ఆఫీస్ కి ముందున్న సెక్యూరిటీని దాటుకొని లోప‌లికి వెళ్లా ఫ‌స్ట్ ఫ్లోర్ లిఫ్ట్ ఓపెన్ చేసుకొని లోప‌లికి వెళుతుండ‌గా ఆ లిఫ్ట్ లో నుంచి ప‌ని రాక్ష‌సుడు ఎదురుప‌డ్డాడు. ఆ రాక్ష‌సుడ్ని చూస్తునే ఉన్నా ఎందుకంటే ఆయ‌నకి నాకు సాన్నిహిత్యం ఉంది సార్ జాబ్ కోసం వ‌చ్చా ప‌లాన వ్య‌క్తి రిఫ‌రెన్స్ తో వ‌చ్చానంటూ నాలో ఉన్న కోరిక‌ను వెలిబుచ్చా. అంతే ఆ వ్య‌క్తి బ‌య‌ట‌కు తీసుకొచ్చి ఓ మూల చివ‌ర‌న టీ కొట్టు ద‌గ్గ‌రికి తీసుకుపోయి సాక్షిలో జ‌రుగుతున్న తంతును త‌నకు జ‌రిగిన అన్యాయాన్ని జ‌గ‌న్ హార్డ్ కోర్ ఫ్యాన్ ను అయిన నేను దుర‌దృష్టం కొద్దీ సాక్షిలో చేరితే ఎలాంటి అవ‌స్థ‌లు ప‌డాలో అన్నీ క‌ళ్ల‌కు క‌ట్టినట్లుగా చూయించాడు. 

న‌న్నుబ‌య‌ట‌కు తీసుకొచ్చిన ఆ వ్య‌క్తి  ఓ కీల‌క‌ డిపార్ట్ మెంట్ హెడ్  ప‌నిరాక్ష‌సుడు మంచి ఇంటిలిజెంట్ .అతనే ఇలా చెబుతుంటే నేను న‌మ్మ‌లేక‌పోయా సాక్షిలో జ‌గ‌న్ హార్డ్ కోర్ అభిమానులైనా స‌రే అక్క‌డి రాజ‌కీయాల‌కు చిత్తు అవ్వాల్సిందే అంతేకాదు త‌న‌ని విధుల నుంచి తొల‌గించి వేరే అస‌మ‌ర్ధుడికి బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని  చెబుతుంటే షాక్ తిన్నా ఆఫీస్ లో నిజాయితీగా పని చేసే ఉద్యోగుల‌కు ప‌నిచేయాలంటే భ‌యం ఎప్పుడు భ‌జ‌న‌బ్యాచ్ త‌మ‌పై లేని పోని రూమ‌ర్స్ ను క్రియేట్ చేస్తుందోన‌ని.

ఇక ఆ భ‌జ‌న బ్యాచ్ లో కొంత‌మంది జ‌గ‌న్ జైలుకు వెళ్లాడ‌ని సంతోష‌ప‌డేవాళ్లు ఉన్నార‌ని జ‌గ‌న్ జైలు నుంచి భ‌య‌ట‌కు వ‌చ్చినా తిట్టుకునే వాళ్లు ఉన్నార‌ని అన్నాడు. దీనికి తోడు జిల్లాల్లో ఉద్యోగులు సాక్షిలో ప‌నిచేస్తున్నారా..? లేక టీడీపీ లో పనిచేస్తున్నార‌నే అనుమానం వ్య‌క్తం చేశాడు. ఎందుకంటే జిల్లాల్లో వైసీపీ కంటే టీడీపీని ఫోక‌స్ చేస్తూ వార్త‌లు రాసే ఉద్దండులు ఉన్నార‌ని అలాంటి వారి వ‌ల్ల పార్టీకి  మీడియాకి న‌ష్టం జ‌రుగుతుంద‌ని వాపోయాడు.

మ‌రి దీన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌లేదా అంటే ముందున్న పెద్ద త‌ల‌కాయ‌ల్ని దాటుకొని వైఎస్. భార‌తి, వైఎస్. జ‌గ‌న్ ను క‌ల‌వాలంటే అసాధ్య‌మ‌ని ఆవేధ‌న వ్య‌క్తం చేశాడు. అంతే ఆ పెద్ద‌మ‌నిషి మాట‌లు విన్న నేను నిరాశ‌తో వెనుదిరిగా . 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE