రెడ్ హాండెడ్ గా “పట్టుబడిన” ఆ నటి ఎవరు?

Updated By VankayaTue, 01/02/2018 - 18:56
who-actress-doing-prostitution

సినిమా తారల్లో.. వ్యభిచార ప్రవృత్తి కొనసాగుతుందని చెప్పేందుకు మరో ఉదంతం బయటపడింది. హైదరాబాద్ కేంద్రంగానే ఈ దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే చాలాసార్లు.. ప్రముఖ నటీమణులపై ఇలాంటి ఆరోపణలు రావడం.. పోలీసుల రైడ్లలో దొరకడం జరిగింది. కాకపోత.. ఇప్పుడు బయటపడింది మన టాలీవుడ్ కు సంబంధించిన వారు కాకపోవడమే కాస్త ఊరట.

పోలీసులు.. నిన్న ఓ టాప్ హోటల్ లో నిర్వహించిన దాడుల్లో.. బాలీవుడ్ నటి వ్యభిచారం గుట్టు బయటపడింది. ఆన్ లైన్ ద్వారా బుకింగ్స్ చేసుకుంటూ.. ఈ దందా నడిపిస్తున్నట్టు ఖాకీల దర్యాప్తులో తేలింది. పోలీసులకు పట్టుబడేందుకు ముందు రోజే సదరు నటి ముంబై నుంచి వచ్చినట్టు కూడా బయటపడింది.

 

ఈ వ్యవహారానికి సంబంధించి.. నిర్వాహకుడు మోనిన్ కడాకియా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకెంత మంది అమ్మాయిలను.. ఈ దుర్మార్గుడు బలి చేస్తున్నాడు.. అతని రాకెట్ లో ఇంకెందరు సెలెబ్రిటీలు ఉన్నారు.. అతనితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి.. అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE