ఆ సీక్రెట్ హీరొయిన్ ఎవరో?

Updated By VankayaThu, 03/15/2018 - 12:03
Secrete heroin

ఆమె ఒకప్పుడు టాప్ మోస్ట్ హీరొయిన్. ఫలానా స్టార్ హీరోతో నటించలేదు అనడానికి అవకాశం లేనంతగా చెలరేగిపోయింది. ఇక రెమ్యునరేషన్ గురించి చెప్పనక్కర్లేదు. కాని అదంతా గతం. ఇప్పుడు చాన్సులు రావడం లేదు. అడపాదడపా వస్తున్నాయి కాని తన పూర్వ వైభవాన్ని తెచ్చేవి కాదు. బాలీవుడ్ లో కూడా మంచి సినిమాలే చేసింది కాని అక్కడ కూడా పెద్దగా పట్టించుకోవడం మానేసారు.

కాని తను మాత్రం హైదరాబాద్ తో అనుబంధం తెంచుకోలేకపోతోంది. అందుకే క్రమం తప్పకుండా భాగ్యనగరానికి విచ్చేస్తూ  తన పాత మిత్రులను కలుస్తూ కొందరి ఫార్మ్ హౌసెస్ లో ఏకాంత సమయాన్ని కూడా ఎంజాయ్ చేస్తోందట. మొదట్లో ఎవరు పెద్దగా పట్టించుకోకపోయినా తర్వాత పదే పదే రావడాన్ని గమనించి ఆరా తీస్తే  అసలు విషయం బయటపడిందని తెలిసింది.

ఇంత రహస్యంగా రావాల్సిన అవసరం ఏముంది అనే అనుమానం రావొచ్చు. షూటింగులు లేని టైం లో అదే పనిగా హైదరాబాద్ వస్తుంటే ఎవరికైనా అనుమానం రావడం సహజం కాబట్టి తన ఆప్తులను ముంబైలో కూడా కలుసుకునే ఏర్పాట్లు చేసుకుందని టాక్. ఇంతకీ ఎవరా హీరొయిన్ అని బుర్రలకు పరీక్ష పెట్టకండి. అంత ఈజీగా పసిగట్టగలిగితే మంచిదే.

క్యారెక్టర్ వేషాలు చేయమని ఆఫర్స్ వస్తున్నా తాను ఇంకా హీరొయిన్ గ్లామర్ తోనే ఉన్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే సమస్యే లేదని తేల్చి చెబుతోందట. వయసు మళ్ళిన అక్క, వదిన పాత్రలు దయచేసి తనకు ఆఫర్ చేయకండి అని గట్టిగానే చెప్పినట్టు టాక్. సో ఇలా ఎంత కాలం నడుస్తుంది కాని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళే దాకా ఈ వేషాలు సాగుతూనే ఉంటాయి.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE