కోమటిరెడ్డి పార్లమెంట్ కు వెళ్తారా?

Updated By VankayaWed, 02/14/2018 - 13:15
Will contest komatireddy for parliament

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త విషయం.. కొంగొత్తగా చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు నల్గొండ మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యోదంతం తర్వాత జరిగిన పరిణామాలు.. కోమటిరెడ్డిలోనూ మార్పు తెచ్చినట్టుగానే కనిపిస్తోంది. నల్గొండ అసెంబ్లీ సీటు నుంచి సెంటిమెంటును రాజేస్తూ.. శ్రీనివాస్ భార్యను ఎమ్మెల్యేగా నిలబెడతానని చెప్పడంతో.. ఆయన భవిష్యత్ వ్యూహం ఏంటన్నదానిపై కొత్త చర్చ మొదలైంది.

ఇన్నాళ్లూ ఈ హత్యను రాజకీయంగా వాడుకుని.. ముఖ్యమంత్రి పీఠం కన్నేయబోతున్నారని కోమటిరెడ్డిపై వార్తలు వచ్చాయి. కానీ.. వాటికి చెక్ పెడుతూ.. తాను పార్లమెంట్ కు పోటీ చేస్తానని కోమటిరెడ్డి చెప్పడం.. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ శ్రేణులనే కాదు. యావత్ తెలంగాణ రాజకీయ వర్గాలనూ షాక్ కు గురి చేసింది. ఈ మాట వెనక అసలు వ్యూహం ఏంటన్నదానిపై చర్చ కూడా జరుగుతోంది.

పైగా.. గతంలో పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు మండలిలో సభ్యుడిగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత.. రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల పరిధిలోకి వచ్చేశారు. ఇప్పుడు.. వాళ్ల కుటుంబం నుంచి.. రాష్ట్ర రాజకీయాల పరిధిలో రాజగోపాల్ రెడ్డిని కొనసాగిస్తూనే.. వెంకట్ రెడ్డి పార్లమెంట్ బరిలో నిలవాలని అనుకుంటున్నట్టుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇదే నిజమైతే.. కాంగ్రెస్ లో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి తగ్గినట్టే అన్న కామెంట్లు.. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE