లేడీ ప్రొడ్యూసర్ తో హీరో పెళ్లి?

Updated By VankayaThu, 01/04/2018 - 12:25
will-lady-producer-and-young-hero-marriage

సినిమాలు, సీరియల్స్ లోనే కాదు అందులో నటించే వాళ్ళ నిజ జీవితంలో కూడా కొన్ని విచిత్రమైన రిలేషన్ షిప్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఇది కూడా అలాంటిదే అనుకోవచ్చు. ఆమె ఒక నిర్మాత. ఇండస్ట్రీలో ఒక పెద్ద కుటుంబానికి చెందిన తను ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. 

గతంలోనే పెళ్లైంది కాని అపార్థాలు వచ్చి విడాకులు కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. ఇక ఇతను కుర్ర హీరో. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు. అవకాశాలు పర్వాలేదు కాని స్టార్ అనే ముద్ర పడేంత పెద్ద హిట్లు పడటం లేదు. గుంపులో గోవిందాలాగా సినిమాలు చేసుకుంటూ నేను ఒకడిని ఉన్నాను అని ఉనికి చాటుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఇద్దరికీ లంకె కుదిరిందట.

 

చాలా రోజుల నుంచి చాలా సన్నిహితంగా ఉన్న ఈ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నట్టు టాక్. అమ్మాయి విడాకులు తీసుకున్న బ్యాచే కాని కుర్రాడు మాత్రం స్టిల్ బ్యాచిలర్. సిన్సియర్ గా ప్రేమించినప్పుడు లెక్కలు వేసుకోము కాబట్టి అతను కూడా ఓకే చెప్పినట్టు ఫిలిం నగర్ లో గుసగుసలు మొదలయ్యాయి. 

ఇది ఇద్దరిలో ఎవరూ బయట పెట్టనప్పటికి చనువుగా ఉండటం, ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళడం, పలు సందర్భాల్లో సినిమా ఫంక్షన్స్ లో బాగా క్లోజ్ గా మూవ్ కావడం ఇవన్ని ఇప్పుడు వస్తున్న వార్తకు బలం చేకూరుస్తున్నాయి. ఏదో ఒకటి ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయితే చాలు అనుకోవడం తప్ప ఎవరైనా చేసేది ఏముంది. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE