నీతులు చెప్పి పాటించని యంగ్ హీరో

Updated By VankayaMon, 03/19/2018 - 11:44
Tollywood Gossips

అతనొక యంగ్ హీరో. పరిశ్రమకు వచ్చి ఐదేళ్ళు దాటుతున్నా ఘనంగా చెప్పుకోవడానికి ఒక్క పెద్ద హిట్టు కూడా లేదు. లేక లేక తన ఫ్యామిలీనే నిర్మాతలుగా పెట్టి ఒక హిట్టు కొట్టాడు. పోటీ ఏది లేకపోవడంతో తక్కువ బడ్జెట్ లో డెబ్యు డైరెక్టర్ రూపొందించిన ఆ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. అంతే మనోడు పట్టా పగ్గాలు లేకుండా చెలరేగిపోతున్నట్టు టాక్.

తను ఈ సినిమా కంటే ముందే ఒప్పుకున్నవేరే మూవీలో ఇంకా ఒక పాట బాలన్స్ ఉండగానే దానికి రానంటు మొండికేసి ఫోన్ లిఫ్ట్ చేయటం కూడా మానేశాడట. ఆడియో రిలీజ్ చేస్తే ఆ ఫంక్షన్ కు సైతం రాకుండా అసలు ఆ సినిమా విడుదల కాకపోతేనే మంచిది అన్నట్టు ప్రవర్తించడంతో నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడ్డారట. నిజానికి ఈ యంగ్ హీరో హ్యండిచ్చిన ఈ మూవీ 23న విడుదల కావాల్సింది. కాని అతని ప్రవర్తన వల్ల పాట తీయకుండానే వచ్చే నెల రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకునట్టు టాక్.

ఇదే హీరో ఈ మద్య పలు ప్రెస్ మీట్లలో నిర్మాతల సాధక బాధల గురించి పడుతున్న ఇబ్బందుల గురించి చిన్న సైజు క్లాసులు తీసుకుంటున్నాడు. అందరు నిజమే కాబోలు అనుకున్నారు. మరి తాను నటించి ఇతరులు నిర్మిస్తున్న సినిమాలో మాత్రం ఆ నీతులు వర్తించవు అనేలా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య ఒక టీవీ ఇంటర్వ్యూ లో మలయాళీ హీరొయిన్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది కూడా ఇతనే.

ఒక్క హిట్టుకే ప్రవర్తనలో ఇన్ని మార్పులు రావడం మంచిది కాదని ఇంతకన్నా గొప్ప హిట్లు చూసి తలపోగరుతో తక్కువ టైంలోనే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన మాజీ కుర్ర హీరోలను ఉదాహరణగా చూడమని చెబుతున్నారు ఇండస్ట్రీ పెద్దలు.ఇప్పుడంటే సక్సెస్ వచ్చింది కాబట్టి ఎంత పేలినా చెల్లుతుంది. మళ్ళి గతంలో లాగా రెండు మూడు వరస దెబ్బలు పడితే గురుడు దారిలోకి వస్తాడు అంటున్న వారు లేకపోలేదు. జీవితానికి టైం కన్నా గొప్ప టీచర్ ఎవరుంటారు

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE