జర్నలిస్టుని వేధించిన స్టార్ హీరో ఎవరు

Updated By VankayaWed, 10/10/2018 - 18:02
Film journalist faces sexual harassment with star he

కాస్టింగ్ కౌచ్ మంటలు కార్చిచ్చులా అంటుకుంటూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్లి ఆగుతాయో ఎవరికి అంతు చిక్కడం లేదు. సినిమా పరిశ్రమకు పరోక్షంగా ప్రమేయం ఉన్న వాళ్ళు కూడా ఇందులో బాధితులుగా ఉండటం షాక్ కలిగిస్తోంది. విషయానికి వస్తే  ఆమె ఒక మాజీ సినిమా జర్నలిస్ట్. పెళ్లికి ముందు వృత్తిలో భాగంగా అన్ని రకాల సినిమా ఈవెంట్స్ కు ఇంటర్వ్యూలకు వెళ్ళేది. అప్పుడే ఒక స్టార్ హీరో పరిచయమయ్యాడు. కల్ట్ సినిమాల్లో నటిస్తాడనే మంచి పేరున్న అతను క్లోజ్ గా మూవ్ కావడాన్ని తొలుత ఆమె అపార్థం చేసుకోలేదు

కానీ ఆ తర్వాత మెల్లగా అతని నుంచి ఫోన్ కాల్స్ మెసేజులు రావడం తీవ్రమయ్యాయి. ఒకసారి గెస్ట్ హౌస్ కు రమ్మని ఆహ్వానం కూడా పంపించాడు. కానీ చలించని ఆ జర్నలిస్ట్ నో చెబుతూనే వచ్చింది. ఓ పార్టీలో ఫుల్ గా మందు కొట్టిన ఆ హీరో ఈమెతో బాగా లిమిట్స్ దాటి ప్రవర్తించాడు. దీంతో అప్పటి నుంచి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. 

తర్వాత ఆ జర్నలిస్ట్ కు పెళ్లి కుదిరింది. పెళ్ళికి రెండు రోజుల ముందు కూడా ఆ హీరో నుంచి రాత్రికి ఓసారి గెస్ట్ హౌస్ కు రమ్మని మళ్ళి ఆహ్వానం. తనకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందని డేట్ కూడా చెప్పడంతో వెంటనే ఆ హీరో కట్ చేసాడు. ఇక అక్కడి నుంచి కాల్స్ ఆగిపోయాయి. ఈ వివరాలు డిటైల్డ్ గా ఆ జర్నలిస్ట్ హీరో  పేరు  ప్రస్తావించకుండా షేర్ చేయడంతో నెటిజెన్లు అతను ఎవరనేది దాదాపు గుర్తు పెట్టేసారు.

దీని మీద ట్రాల్స్ తో పాటు బెదిరింపులు కూడా మొదలవడంతో భయపడిన సదరు జర్నలిస్ట్ వెంటనే తన మెసేజ్ ని డిలీట్ చేసింది. ఇప్పుడు ఇది మీడియా సర్కిల్స్ లో హాట్ డిస్కషన్. కాదేది కామానికి అనర్హం అనే తరహాలో కొందరు హీరోల ప్రవర్తన గురించి ఇప్పుడిప్పుడే చేదు నిజాలు బయటికి వస్తున్నాయి. మీ టూ ఉద్యమం పేరుతో మొదలైన ఈ రగడ ముందు ముందు ఇంకా సెన్సేషన్ చేసేలా ఉంది. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE