10వ త‌ర‌గ‌తి పాస్ అయితే చాలు వేల‌ల్లో సంపాదించవ‌చ్చు

Updated By VankayaSun, 10/07/2018 - 10:52
Bank Mitra Benefits, Salary and Commissions

మీకు 18ఏళ్లు నిండాయా..? మీరు చ‌దివింది 10వ త‌ర‌గ‌తేనా..? చ‌దివిన చ‌దువుకు ఉద్యోగం రావ‌డంలేద‌ని బాధ‌ప‌డుతున్నారా..? అధైర్య‌ప‌డ‌కండి నేనున్నాంటోది బ్యాంక్ మిత్ర‌. 10వ త‌ర‌గ‌తి చ‌దివి 18ఏళ్లు నిండితే చాలు నెల‌కు 30 నుంచి 40వేలు వ‌ర‌కు సంపాదించ‌వ‌చ్చు.  
ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న ఇది రాజ‌కీయ నాయ‌కులు చెప్పేమాట‌. కానీ ఇప్పుడు బ్యాంక్ లు కూడా అదే మాట చెబుతున్నాయి. 

 బ్యాంక్ మిత్ర..! ఇంకా చెప్పాలంటే క‌ష్ట‌మ‌ర్ స‌ర్వీస్ పాయింట్. కేంద్రం ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన  ఈ ప‌థ‌కం కింద‌  18 ఏళ్ల ఎవరైనా బ్యాంక్ మిత్ర కావొచ్చు. పై అర్హ‌త‌లు ఉండి, ఎటువంటి అనుభ‌వం లేక‌పోయినా స‌రే కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. నెల‌కు వేల‌ల్లో సంపాదించ‌వ‌చ్చు. 

బ్యాంక్ మిత్ర అంటే మీ సేవ త‌ర‌హాలో ఉండే ప‌థ‌కం. ఈ ప‌థ‌కంలో బ్యాంక్ లు అందించే స‌ర్వీసుల్నీ ఈ బ్యాంక్ మిత్రా ద్వారా అందించాలి. వీటితో పాటు ఇత‌ర స‌ర్వీసులు అంటే సేవింగ్ అకౌంట్లు, లావాదేవీలు,రిక‌రింగ్ డిపాజిట్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఓవర్‌డ్రాఫ్ట్ సేవ, కిసాన్ క్రెడిట్ సేవలు, ఇన్సూరెన్స్ , మ్యూచువల్ ఫండ్ అమ్మకాలు, పెన్షన్ అకౌంట్,  బిల్ చెల్లింపులు, టికెట్ బుకింగ్, పాన్ కార్డ్ సేవలు అందించాలి.  మీరు ఏ బ్యాంక్ కు మిత్ర సేవ‌లు అందిస్తారో ( ప‌థ‌కంలో పొందుప‌రిచిన ష‌ర‌తుల ఆధారంగా )ఆ బ్యాంక్ నుంచి నెల‌వారి జీతంతో పాటు మీ సేవ‌ల ఆధారంగా క‌మీష‌న్లు కూడా పొంద‌వ‌చ్చు. 

దీనికి పై అర్హ‌త‌తో పాటు కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్, 100 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ ఉండాలి. సీఎస్పీ ఏర్పాటుకు లోన్ కూడా ఇస్తుంది బ్యాంకు. ఇంకెందుకు ఆల‌స్యం బ్యాంక్ మిత్ర‌లో చేరండి. వేలల్లో డ‌బ్బులు సంపాదించండి. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE