ఎస్బీఐ బ్యాంక్ లో షుగ‌ర్ ఎక్కువైందా..?

Updated By VankayaSun, 10/07/2018 - 10:46
SBI cash deposit limit: Here's what customers are allowed to do now

అదేంటీ ఎస్బీఐ బ్యాంక్ లో షుగ‌ర్ ఎక్కువ అవ్వ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా..? అలా అని బ‌్యాంక్ లో షుగ‌ర్ అమ్మ‌డం లేదండోయ్. ఓ వైపు ఎస్బీఐ త‌న క‌ష్ట‌మ‌ర్ల న‌డ్డి విరుస్తూనే..మ‌రో వైపు రోజు రోజుకి శుభ‌వార్త‌లు చెప్పి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అందుకే ఎస్బీఐ బ్యాంక్ లో షుగ‌ర్ ఎక్కువైంది అనేది. 

ఇక అస‌లు విష‌యానికొస్తే  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క‌ష్ట‌మ‌ర్ల‌కు శుభవార్త‌ను అందించింది. నిన్న‌టికి నిన్న అద‌న‌పు ఛార్జీలు, డ‌బ్బులు డ్రా చేసుకోవ‌డంపై ప‌రిమితులు విధించిన విష‌యం తెలిసిందే.  కానీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించిన ఎస్బీఐ క‌ష్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పింది. నిర్వాహాణ‌లోపం, ఏటీఎం సెంట‌ర్ల‌లో అవ‌క‌త‌వ‌క‌లు, అద‌న‌పు ఛార్జీల భారంతో ఏటీఎం సెంట‌ర్ల‌పై దృష్టిసారించిన ఎస్బీఐ గ‌రిష్ట ప‌రిమితిని రూ.20,000కు త‌గ్గించింది. ఇంత‌కు ముందు రూ.40,000వేలు ఉండేది. 

అయితే ఈ విధానంపై క‌ష్ట‌మ‌ర్లు మండిప‌డ‌డంతో న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది ఎస్బీఐ బ్యాంక్ ల్లో , ఇత‌ర బ్యాంకుల్లో న‌గదు డిపాజిట్ల‌పై ఉన్న ప‌రిమితిని తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.  
ఎస్బీఐలో న‌గ‌దు డిపాజిట్ చేయాలంటే  20,000 వేలు ఇత‌ర బ్యాంకుల్లో రూ.25,000మించి చేయ‌కూడ‌దు. తాజా ఉత్త‌ర్వులు ప్ర‌కారం ఎస్బీఐ తో పాటు ఇత‌ర బ్యాంకుల న‌గ‌దు డిపాజిట్ల‌పై ఉన్న ప‌రిమితిని ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE