బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న హీరొయిన్ దిశా పటాని అతన్ని తన కంట్రోల్ లో పెట్టేసుకుంది అనే వార్త ఇప్పుడు టాక్ అఫ్ ది బాలీవుడ్ గా మారింది. ఇద్దరు కలిసి ప్రస్తుతం భాగి 2 సినిమాలో నటిస్తున్నారు. ఇందుకోసం దిశా పటాని ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకుంటోంది. దాని కన్నా ముందే దిశా పటాని టైగర్ ష్రాఫ్ తో లవ్ లో పడింది అని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

మెగా ఫ్యామిలీ సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ‘రేయ్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా అతడి కెరీర్‌ను అయోమయంలోకి నెట్టేలా కనిపించినప్పటికీ.. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా అతడికి తొలి విజయాన్నందించింది. హీరోగా నిలబెట్టింది. ఆ సినిమాకే తాను పారితోషకం కింద తొలి చెక్కును అందుకున్నట్లు సాయిధరమ్ వెల్లడించాడు.

ఫిబ్రవరి రెండో వారాంతంలో మూడు సినిమాలు రిలీజయ్యాయి. వాటితో పాటే అదే వీకెండ్లో నిఖిల్ సినిమా ‘కిరాక్ పార్టీ’ కూడా రావాల్సింది. కానీ ఆ సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడం..ఇంకొన్ని కారణాల వల్ల సినిమా విడుదల కాలేదు. ఫిబ్రవరి 23 ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ ఫిబ్రవరి ద్వితీయార్ధం నుంచి అన్ సీజన్ మొదలవుతుంది.

స్టూడెంట్స్ పరీక్షల్లో మునిగిపోవడం వల్ల సినిమాల వైపు చూడరు. ఇది కాలేజీ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ కావడంతో స్టూడెంట్ ఆడియన్సే కీలకం. కాబట్టి ఇప్పుడు సినిమాను రిలీజ్ చేయడం మంచిది కాదని నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

టాక్ తేడాగానే ఉంది. ఓవర్సీస్ లో మాత్రం దుమ్ము రేపుతోంది. సినిమా చూసివచ్చిన ప్రేక్షకులు అయోమయంలో కొంత పెదవి విరుస్తున్నారు కాని చూడాలి అనుకున్న వాళ్ళను మాత్రం ఆపలేకపోతున్నారు. మొత్తానికి సినిమాలో చూపించిన గందరగోళంలాగే అ! వసూళ్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే యుఎస్ లో అర మిలియన్ మార్క్ దాటేసిన అ! హాలీవుడ్ సినిమా బ్లాంక్ పాంథర్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ స్క్రీన్స్ దక్కించుకోలేదు కాని ఈ శుక్రవారం నుంచి అదనంగా జోడించబోతున్నారు.

జిఎస్టి వీడియో ఫిలిం వివాదంలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు టీవీ9 ఛానల్ మీద కత్తులు దూస్తున్నాడు. తనను సదరు ఛానల్ పూర్తిగా వాడుకుని వాస్తవాలను వక్రీకరించి తప్పుడు వార్తలు ప్రచారం చేసి తనకు అప్రతిష్ట తెస్తున్నారని తన ట్విట్టర్ లో మండిపడిన వర్మ తన లాయర్లు దీని గురించి పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉన్నారని చెప్పాడు.

జరుగుతున్న విచారణ గురించి లీక్స్ రూపంలో న్యూస్ ప్రచారం చేస్తున్నారు అని చెప్పిన వర్మ ఈ సారి యాంకర్ రజనీకాంత్ పేరును కూడా అందులో ప్రస్తావించాడు. చట్ట ప్రకారం టీవీ9 అన్ని రకాల చర్యలకు సిద్ధ పడాల్సి ఉంటుందని వర్మ హెచ్చరిక జారీ చేసాడు.

అజ్ఞాతవాసి దెబ్బకు పూర్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడు బయటికి వస్తాడో అర్థం కావడం లేదు. తను కనిపిస్తే మీడియా దాని ఫలితం గురించి, ఫ్రెంచ్ సినిమా కాపీ గురించి పదే పదే ప్రశ్నిస్తుంది కాబట్టి అనవసరమైన తలనెప్పి తెచ్చుకోవడం ఇష్టం లేని త్రివిక్రమ్ సైలెంట్ గా ఒంటరిగా ఉంటూ జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ ని ఇంకాస్త జాగ్రత్తగా వండే పనిలో ఉన్నాడట.

సరిగ్గా 18 ఏళ్ళ క్రితం హృతిక్ రోషన్ సెన్సేషనల్ డెబ్యు మూవీ కహో నా ప్యార్ హై తో హీరొయిన్ గా పరిచయమైన అమీషా పటేల్ తర్వాత కొన్నాళ్ళు బాగానే హల్చల్ చేసింది. తెలుగులో మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ బద్రిలో చేసి టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అమీషా ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన చేసింది కాని ఇక్కడ పెద్దగా సక్సెస్ అందుకోలేదు.

టైం బాగుంటేనే సినిమా పరిశ్రమలో అన్ని ఉంటాయి. ఏ మాత్రం తేడా వచ్చినా బొమ్మ తిరగబడుతుంది. ప్రస్తుతం మెగా హీరో సాయి ధరం తేజ్ పరిస్థితి అలాగే ఉంది. ఇంటెలిజెంట్ చూసాక సాయి ఎంత దారుణమైన తప్పులు చేస్తున్నాడో అర్థం చేసుకున్న ఫాన్స్ అతని రాబోయే సినిమాల మీద కూడా నమ్మకం పోగొట్టుకునే దాకా తెచ్చుకున్నాడు. వరసగా ఐదు ఫ్లాపులు వచ్చాక నిలవడం అంత ఈజీ కాదు.

తన మొదటి సినిమా రన్ రాజా రన్ పెద్ద హిట్ అయినా టైం కలిసి రాని హీరొయిన్ సీరత్ కపూర్ కొంచెం ట్రాక్ మార్చి బోల్డ్ గా అడుగులు వేస్తోంది. గత ఏడాది చేసిన రెండు సినిమాలు రాజు గారి గది 2, ఒక్క క్షణం కంటెంట్ పరంగా, తన పాత్ర పరంగా మంచి పేరు తెచ్చినప్పటికి కమర్షియల్ గా ఘన విజయం సాధించినవి కాకపోవడంతో తనకు నిరాశ తప్పలేదు. దాని తోడు న్యూ ఇయర్ లో కలిసి వస్తుందిలే అని నమ్మి రవితేజ తో  చేసిన టచ్ చేసి చూడు సైతం డిజాస్టర్ ఖాతాలో పడిపోవడంతో పాపం సీరత్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది.

ఒకే ఒక్క టీజర్ తో దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన ప్రియా ప్రకాష్ వారియర్ ను పరిచయం చేసిన ఒరు ఆదార్ లవ్ దర్శకుడు ఒమర్ లుల్లు చిక్కుల్లో పడ్డాడు. ప్రియా ప్రకాష్ తన బాయ్ ఫ్రెండ్ కు కన్ను గీటుతూ ఉండగా వచ్చే పాటలో తమ మత పెద్దలను అవమానించే విధంగా లిరిక్స్ ఉన్నాయంటూ కొందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో ఆ మేరకు దర్శకుడికి సౌత్ జోన్ పోలీసులు నోటీసులు పంపించారు.

మహానటి సావిత్రి షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. గతంలో ప్రకటించిన మార్చ్ 29 రావడం దాదాపు అసాధ్యమే. పైగా అనుష్క భానుమతి గారి పాత్ర వేయబోతోంది అనే కొత్త వార్త వచ్చిన నేపధ్యంలో ఇంకా షూటింగ్ చాలా పెండింగ్ లో ఉందనే విషయం స్పష్టంగా అర్థమైపోతోంది. స్వర్గీయ ఎన్టీఆర్ గారి పాత్ర కూడా ఇంకా చిత్రీకరించాల్సి  ఉన్న నేపధ్యంలో ఏం జరుగుతోందో కూడా ఎవరికి అర్థం కావడం లేదు.

చేసింది చిన్న పాత్రే అయినా భాగమతిలో అనుష్క పక్కన జోడిగా నటించిన ఉన్ని ముకుందన్ మలయాళంలో పేరున్న హీరోనే. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కొడుకుగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించింది కూడా ఇతనే. రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ ఇతని పాత్రలు చాలా తక్కువ పరిధి ఉన్నవి కావడంతో ఆశించిన పేరు రాలేదు.

గత ఏడాది వచ్చిన బాలయ్య పైసా వసూల్ సినిమా చూసారుగా. రిజల్ట్ ఎలా ఉన్నా అందులో నటించిన హీరొయిన్ ముస్కాన్ సేతి మాత్రం ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. ఒకవేళ హిట్ అయ్యుంటే పరిస్థితి ఎలా ఉండేదో కాని పాపం అది ఫ్లాప్ కావడంతో అవకాశాలు రావడం లేదు. పైగా సీనియర్ హీరోతో నటించిన సినిమా కావడం  ముస్కాన్ కు మరో సమస్యగా మారింది.

ఒకప్పుడు తెలుగు సినిమాలకు ధీటుగా తమిళ్ డబ్బింగులు ఇక్కడ భారీగా ఆడేవి. శంకర్, మణిరత్నం, మురుగదాస్ లాంటి దర్షకుల సినిమాలు వస్తాయి అంటే మనవి వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉండేవి.  కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

నటి హేమ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినట్టు కనిపిస్తుంది కాని తను నిజానికి చాలా సీనియర్ యాక్టర్. సుమారు 30 ఏళ్ళ క్రితమే పరిశ్రమకు వచ్చిన హేమ అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో సైతం చిన్న చిన్న వేషాలు ఎన్నో వేసింది. రామ్ గోపాల్ వర్మ క్షణ క్షణం సినిమాలో శ్రీదేవి కొలీగ్ గా చాలా యుక్త వయసులో ఉన్న హేమను గమనించవచ్చు.

YOU MAY LIKE