కోటలు దాటుతున్న కౌశల్ మాటలు

Updated By VankayaWed, 10/10/2018 - 16:59
Kaushal

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా కౌశల్ ఏం సాదించాడు అనేది జనం ఇప్పటికే మర్చిపోయారు. సినిమా చూపించినంత ప్రభావం టీవీ రియాలిటీ షో చూపించే అవకాశం లేదని తెలిసినప్పటికీ కౌశల్ మాత్రం తన పేరిట అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఆర్మీని చూసుకుంటూ మురిసిపోతూ గాల్లో తేలిపోతున్నాడు. అంతే కాదు అతిశయోక్తితో కూడిన మాటలు చెబుతూ తన విశ్వసనీయతపై అనుమానం వచ్చేలా చేసుకుంటున్నాడు. 

ఇటీవలే ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌశల్ మాటలు ఇదే సూచిస్తున్నాయి. బిగ్ బాస్ టైటిల్ గెలిచాక తనకో యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వాలని సమాచారం ఇచ్చిందని పూర్తి వివరాలు త్వరలోనే చెబుతానంటూ నిన్న ట్విట్టర్ లో వీడియో మెసేజ్ పోస్ట్ చేసింది మర్చిపోక ముందే ఇప్పుడు ముఖాముఖీ తాలూకు వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి మించిన రియాలిటీని ఊహించుకుంటూ కౌశల్ నిజం చెబుతున్నాడో అబద్దం చెబుతున్నాడో అర్థం కానీ పరిస్థితి. 

ఇక్కడితో ఆగితే బాగుండేది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆఫీస్ నుంచి కూడా తనకు కాల్ వచ్చిందని షూటింగ్ లో ఉండటం వల్ల నాన్న లిఫ్ట్ చేసి థాంక్స్ చెప్పారని కౌశల్ అనడం మరో ట్విస్ట్. అంతేకాదు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చిందన్న కౌశల్ త్వరలోనే వాళ్ళు సంప్రదించి పుస్తకంలో నమోదు చేసేలా చూస్తారని చెప్పడం మరో వింత. ఇవన్నీ పక్కన పెడితే 40 కోట్ల ఓట్లు ఎలా వచ్చాయి అనే దాని గురించి యాంకర్ ప్రశ్నించినప్పుడు దాటవేత సమాధానంతో త్వరలో ఆధారాలు చూపిస్తామని చెప్పి స్మార్ట్ గా తప్పుకోవడం కొసమెరుపు. అయినా అన్ని వచ్చాక చెప్పుకుంటే బాగుంటుంది కానీ గిన్నిస్ బుక్, డాక్టరేట్ అంటూ ముందే ఇంత పబ్లిసిటీ చేసుకుంటేనే  సందేహాలు వస్తాయి. 
 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE