పరిశ్రమను కుదిపేస్తున్న మీటూ

Updated By VankayaFri, 10/12/2018 - 15:05
Amyra Dastur

బాలీవుడ్ మొత్తం మీటూ ప్రకంపనల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది. రోజుకు కనీసం ఐదు నుంచి పది దాకా బాధితులు బయటికి వచ్చి తాము ఎవరెవరి చేత బాధింపబడ్డామో వంతుల వారీగా పేర్లు బయటపెడుతూ ఉండటంతో  ఇది రోజుకో మలుపు తిరుగుతోంది. అమిర్ ఖాన్ ఇప్పటికే దీనికి మద్దతు తెలుపుతూ గుల్షన్ కుమార్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మొఘల్ నిర్మాణం నుంచి బయటికి రావడమే కాదు దాని దర్శకుడు సుభాష్ కపూర్ అందులో నుంచి తాత్కాలికంగా బయటికి రావడానికి కారణం అయ్యాడు.

ఇక అక్షయ్ కుమార్ సైతం దర్శకుడు సాజిద్ ఖాన్ మీద వచ్చిన ఆరోపణల్లో నిజం తేలేంత వరకు హౌస్ ఫుల్ 4 షూటింగ్ ఆపేయమని ఇప్పటికే తాకీదు జారీ చేసాడు. ఇందులో పూజా హెగ్డే కూడా నటిస్తోంది. ఇక సుప్రసిద్ధ దర్శక నిర్మాత సుభాష్ ఘాయ్ కు కూడా ఈ మీ టూ సెగ తాకింది. తనుశ్రీదత్తా నానా పాటేకర్ మీద మొదలుపెట్టిన ఈ మీటూ ఉద్యమం ఎక్కడికో వెళ్ళిపోతోంది. 

బాలీవుడ్ ప్రముఖులు మాత్రం ఇధి గాలిబుడగ కారాదని కోరుకుంటున్నారు. నిందితులకు శిక్ష పడే దాకా పోరాడి దీని అంతు తేల్చాలని అప్పటిదాకా లైంగిక వేధింపులు ఆగవని చెబుతున్నారు. ఇది మెల్లగా సౌత్ వైపు వస్తోంది. గాయని కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి  ఈ విషయంలో ముందంజలో ఉండగా సమంతా లాంటి వాళ్ళు మద్దతు పలుకుతున్నారు. కొద్దిరోజుల్లో ఇక్కడ కూడా పెద్ద పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉంది.

మనసుకు నచ్చింది-రాజుగాడు హీరోయిన్ అమైరా దస్తూర్ సౌత్ లో ఓ ప్రముఖ హీరో తనను వేధించాడని త్వరలోనే పేరు బయటపెడతానని గట్టిగానే చెప్పింది. చూస్తుంటే ఈ మీటూ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పెద్ద పెద్ద పేర్లతో పాటు ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనల్లో అలోక్ నాథ్ లాంటి సీనియర్ నటులను ఇందులో లాగడం చూస్తే బాలీవుడ్ లో బిగ్గెస్ట్ సెన్సేషన్ గా ఈ మీ టూ ఉద్యమం నిలిచేలా ఉంది. కాకపోతే తేలుకుట్టిన దొంగల్లా కొందరు సైలెంట్ గా ఉండటం కొత్త అనుమానాలు తెచ్చి పెడుతోంది. 
 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE