రికార్డుల మోత - మొదటి రోజు వసూళ్లు

Updated By VankayaFri, 10/12/2018 - 12:54
Aravinda Sametha First Day Collections

టాక్ ఎలా ఉంది, కంటెంట్ ఏంటి అనే విషయాలను కాసేపు పక్కన పెడితే యంగ్ టైగర్ అరవింద సమేత వీర రాఘవ మొదటి రోజు వసూళ్ల ఊచకోత కోసింది. కెరీర్ బెస్ట్ అందుకున్న తారక్ దీంతో టాప్ 3 లోకి చేరిపోయాడు. నిన్న గురువారమే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో లెక్కలేనన్ని బెనిఫిట్ షోలకు తోడు ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించడంతో తారక్ పెట్రేగిపోయాడు.

యావరేజ్ మ్యాటర్ ఉన్నా క్రేజీ కాంబో తోడైతే ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ సాక్షిగా కనిపిస్తోంది. ఇక ఫస్ట్ డే 26 కోట్ల దాకా డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టిన అరవింద సమేత వీర రాఘవ ఈ మూడు రోజులు ఇంతే బలంగా ఉండటం ఖాయం. సోమవారం నుంచి కొనసాగించే జోరుని బట్టి ఇండస్ట్రీ హిట్ గా మిగులుతుందో లేదో తేలిపోతుంది. ఇక ఏరియా వారీగా వసూళ్ల లెక్కలు ఈ విధంగా ఉన్నాయి 

నైజామ్ - 5 కోట్ల 73 లక్షలు 

సీడెడ్ - 5 కోట్ల 30 లక్షలు 

ఉత్తరాంధ్ర - 3 కోట్ల 12 లక్షలు 

ఈస్ట్ గోదావరి - 2 కోట్ల 78 లక్షలు 

వెస్ట్ గోదావరి - 2 కోట్ల 37 లక్షలు 

కృష్ణా - 1 కోటి 64 లక్షలు 

గుంటూరు - 4 కోట్ల 14 లక్షలు 

నెల్లూరు  1 కోటి 7 లక్షలు 

తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ డే షేర్ - 26 కోట్ల 15 లక్షలు 

ఇప్పటికే అందిన రిపోర్ట్స్ ప్రకారం ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ దాటేసిన అరవింద సమేత జనతా గ్యారేజ్ రికార్డు దాటడం ఖాయంగానే కనిపిస్తోంది. ఓవర్సీస్ లో 13 కోట్ల దాకా బిజినెస్ జరిగిన నేపధ్యంలో టార్గెట్ కాస్త పెద్దగానే ఉంది. సౌత్ లో ఇతర రాష్ట్రాలకు 10 కోట్ల దాకా బిజినెస్ జరుపుకున్న ఈ మూవీకి కర్ణాటకలో బ్రహ్మరధం దక్కుతోంది. మొత్తం 93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న వీర రాఘవుడు మొదటి రోజే పాతిక శాతం రాబట్టడం చూస్తే స్టామినా ఏంటో అర్థమైపోతోంది. తెలంగాణలో ఎక్స్ట్రా షోలతో పాటు టికెట్ ధరలు పెంచకపోయినా ఇంత మొత్తం రావడం విశేషమే. నైజామ్ లో జనతా గ్యారేజ్ సెట్ చేసిన ఐదున్నర కోట్ల రికార్డు దీంతో తుడిచిపెట్టుకుపోయింది. 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE