వస్తే ఎంత ? పోతే ఎంత ?

Updated By VankayaWed, 10/10/2018 - 18:10
Pre release business of Aravinda Sametha

ఇంకో పది గంటల్లో అరవింద సమేత వీర రాఘవుడి ఊచకోత మొదలవుతుంది. ప్రీమియర్ షోల కోసం అటు అమెరికా మొదలుకుని ఇటు అనకాపల్లి దాకా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రికార్డు స్థాయిలో మొదటి రోజుల ఆటలు పడబోతున్నాయి. చిన్న చిన్న సెంటర్స్ లో సైతం ఎన్ని థియేటర్లు ఉంటే అన్నింటిలో ఇదే వేస్తున్నారు. ఇక బిజినెస్ పరంగా వీర రాఘవుడి ముందు పెద్ద టార్గెట్ ఉంది.

ప్రపంచవ్యాప్త థియేట్రికల్ రైట్స్ 91 కోట్ల దాకా చేసారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచే 67 కోట్ల వ్యాపారం జరిగింది. ఇప్పుడు ఇంత మొత్తంలో షేర్ దాటితేనే ఇది హిట్ కిందకు వస్తుంది. అంటే మొత్తం కలిపి 95 కోట్ల దాకా షేర్ వస్తే రంగస్థలం, భరత్ అనే నేను తరహాలో హ్యాపీగా బ్లాక్ బస్టర్ ఖాతాలో వేయొచ్చు. ఒకవేళ అంత కన్నా తక్కువగా వస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. 

రంగస్థలం మొత్తం రన్ లో సుమారు 125 కోట్ల దాకా షేర్ ఇచ్చి అల్ టైం ఇండస్ట్రీ హిట్స్ లో స్థానం సంపాదించుకుంది. భరత్ అనే నేను 95 కోట్ల దాకా షేర్ రాబట్టి ఎవరూ నష్టపోకుండా కాపాడింది. కానీ 125 కోట్ల దాకా బిజినెస్ చేసిన అజ్ఞాతవాసి కేవలం 60 కోట్ల దగ్గరే ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది. ఒకవేళ అరవింద సమేత వీర రాఘవ కనక 100 కోట్ల మార్క్ అందుకుంటే టాప్ 5 లోకి చేరిపోతాడు.

కానీ అదంత ఈజీ కాదు. రేపు వచ్చే టాక్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. అది ఎలా ఉన్నా మొదటి నాలుగు రోజులకు ఎంత లేదన్నా 35 నుంచి 40 కోట్ల దాకా షేర్ వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. యావరేజ్ అన్నా సేఫ్ కావొచ్చు. ఎలాగూ దసరా సెలవుల సీజన్ కాబట్టి ఇబ్బంది ఉండదు. కాదు పెదవి విరిచేలా రిపోర్ట్స్ వచ్చాయి అంటే మాత్రం చిక్కుముళ్లు తప్పవు. సో రేపు  ఈ సమయానికి రివ్యూస్ రిపోర్ట్స్ తో సహా మొత్తం ట్రేడ్ అంచనాల గురించి క్లారిటీ వచ్చేస్తుంది. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE