హమ్మయ్య అనుకుంటున్న బన్నీ

Updated By VankayaFri, 10/12/2018 - 10:09
Allu Arjun

నా పేరు సూర్య దెబ్బకు ఏకంగా ఆరు నెలల నుంచి ఖాళీగా ఉన్న అల్లు అర్జున్ కొత్త సినిమా గురించి ఇంకా మీనమేషాలు లెక్కబెడుతూనే ఉన్నాడు. విక్రమ్ కుమార్ తో కథ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో దాన్ని వాయిదా వేసుకున్న స్టైలిష్ స్టార్ త్రివిక్రమ్ కోసం ఎదురు చూస్తున్నాడని గత కొద్ధి  రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. త్రివిక్రమ్ సైతం అరవింద సమేత వీర రాఘవ ప్రమోషన్ వరకు ఎడతెగని బిజీ షెడ్యూల్ లో ఉండటంతో దాని గురించి చర్చించే అవకాశం లేకపోయింది.

నిన్న ఇద్దరు కలిసి ఈ సినిమా చూసారు. బయట వస్తున్న టాక్, నమోదవుతున్న కలెక్షన్స్ ఇవన్నీ చూసాక బన్నీకి త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అనే నమ్మకం వచ్చేసిందట. తన సంతోషాన్ని షో అవ్వగానే షేర్ చేసుకున్న అల్లు అర్జున్ త్వరలోనే మొదలుపెట్టేలా చేయమని రిక్వెస్ట్ కూడా చేసాడని టాక్ వస్తోంది.  మొన్న ఇంటర్వ్యూలలో వెంకటేష్, అల్లు అర్జున్ లతో కథ రెడీ అవ్వగానే చేయాల్సి ఉందని త్రివిక్రమ్ చెప్పిన సంగతి తెలిసిందే. సో దాదాపు ఈ కాంబోకు రంగం సిద్ధమైనట్టే అని చెప్పుకోవచ్చు. 

నిజానికి ప్లాప్ అనేది ఏ హీరోకైనా సహజమే అయినప్పటికీ అల్లు అర్జున్ అవసరానికి మించి గ్యాప్ తీసుకున్నాడు. నా పేరు సూర్య విషయంలో దర్శకుడు వక్కంతం వంశీని గుడ్డిగా నమ్మడమే ముంచేసిందని ఇప్పటికీ తన సన్నిహితుల దగ్గర చెబుతున్న బన్నీ అందుకోసమే మరోసారి పొరపాటు జరగకుండా ఎందరు కథలతో తన వద్దకు వస్తున్నా అంత ఈజీగా ఒప్పుకోవడం లేదట. జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి ల తర్వాత త్రివిక్రమ్ తో  చేసే హ్యాట్రిక్ మూవీ అవుతుంది కాబట్టి ఆ రకంగా ఫ్యాన్స్ కూడా ఇది రిపీట్ అవ్వడం కోసమే ఎదురు చూస్తున్నారు.

ఒకవేళ కార్యరూపం దాల్చినా ఇది మొదలుపెట్టి విడుదల చేయడానికి ఎంత లేదన్నా ఏడాది దాకా పడుతుంది. అంటే వచ్చే వేసవి అయ్యాకే బన్నీ కొత్త సినిమా వస్తుంది. ఎంత ఫాస్ట్ గా షూటింగ్ చేసినా మహా అయితే ఓ రెండు నెలలు ముందు తప్ప ఇంకో ఛాన్స్ లేదు. అదేదో త్వరగా ప్రకటించామని కోరుతున్నారు అభిమానులు. 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE