నాని వద్దంటున్నాడా

Updated By VankayaFri, 10/12/2018 - 15:49
Nani, Kajal Aggarwal

న్యాచురల్ స్టార్ నానికి ఈ ఏడాది బొత్తిగా కలిసి రాలేదు. కృష్ణార్జున యుద్ధం డిజాస్టర్ కాగా దేవదాస్ యావరేజ్ అనిపించుకోవడానికే నానా తంటాలు పడుతోంది. ఇక బిగ్ బాస్ 2 షోకి యాంకర్ గా కొత్త అవతారం ఎత్తితే పేరు కన్నా ట్రాలింగ్ వల్ల తలనెప్పే ఎక్కువగా వచ్చింది. అందుకే వచ్చే ప్రాజెక్ట్స్ విషయంలో ప్రతిదీ ఒకటికి రెండుసార్లు బాగా అలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడట.

ప్రస్తుతం జెర్సీ షూటింగ్ కోసం రెడీ అవుతున్న నాని దాని తర్వాత చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ దాన్ని నిర్మించే ప్లానింగ్ లో ఉంది. ఇందులో హీరోయిన్ కోసం ప్రస్తుతం వేట సాగుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం నిర్మాతలు కాజల్ పేరు ని సజెస్ట్ చేస్తే నాని వద్దని చెప్పాడట. కథ ప్రకారం కొత్త లేదా తక్కువ అనుభవం ఉన్న అమ్మాయి అయితే ఫ్రెష్ అప్పీల్ ఉంటుందని కాజల్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన జోడి అనిపించదేమో అన్నాడట. 

ఇది అఫీషియల్ న్యూస్ కాదు కానీ నిజమే అని టాక్. ఇండస్ట్రీకి కాజల్ వచ్చి పదేళ్లు దాటుతున్నా ఇంకా మంచి అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరో ఏకంగా రెండు సినిమాల్లో తనను తీసుకున్నాడు. క్వీన్ రీమేక్ కోసం తమిళ్ లో కాజల్ కంటే బెస్ట్ ఆప్షన్ కనిపించలేదు. చిరంజీవి లాంటి వంద సినిమాలు తీసిన హీరోతో ఇప్పుడిప్పుడే తానేంటో ప్రూవ్ చేసుకుంటున్న రానాతో ఒకే ఏడాదిలో నటించడం లాంటి విశేషాలు కాజల్ కెరీర్ లో ఉన్నాయి.

మరి నాని తనకు జోడిగా నప్పదు అనుకున్నది పైన చెప్పిన కారణమా లేక ఇంకోటా అనేది సస్పెన్స్. మైత్రి వాళ్ళ దగ్గర గతంలో రవితేజ సినిమా కోసం తీసుకున్న కాజల్ డేట్స్ అలాగే మిగిలిపోయాయట. అవి ఏం చేయాలో అర్థం కాక ఇలా అయినా వాడుకుందాం అనుకుంటే నాని మాత్రం స్మూత్ గా నో చెప్పినట్టు సమాచారం. లోగుట్టు పెరుమాళ్ళకెరుక. 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE