పెద్ద తలకాయలలో కామ పైత్యం ఇంతుందా ?

Updated By VankayaWed, 10/10/2018 - 16:38
Chinmayi shares her shocking personal experience with Vairamuthu

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా పేరున్న చిన్మయి శ్రీపాద మీ టూ ఉద్యమాన్ని కొత్త లెవెల్ కు తీసుకెళుతోంది. ఒకపక్క బాలీవుడ్ లో లైంగిక వేధింపుల ఆరోపణలు రోజుకో మలుపు తిరుగుతుండగానే సౌత్ లో కూడా దాని తాలూకు ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ విషయంలో గాయని చిన్మయి ముందుండటం ఆశ్చర్యపరిచే విషయం. తాజాగా కోలీవుడ్ సుప్రసిద్ధ గీత రచయిత పద్మ భూషణ్ అవార్డు గ్రహీత వైరముత్తుని ఇందులోకి లాగడంతో ఇది కొత్త మలుపులు తిరుగుతోంది.

ఒకసారి స్విట్జర్ ల్యాండ్ కు మ్యూజికల్ టూర్ కోసం వెళ్ళినప్పుడు వైరముత్తు తనతో చాలా అసభ్యకర రీతిలో ప్రవర్తించేందుకు ప్రయత్నించాడని అతనో కామ రోగి అంటూ చిన్మయి ట్వీట్ చేయడం చాలా దూరం వెళ్లేలా ఉంది. అంతే కాదు తెలుగులో గాయకుడిగా సంగీత దర్శకుడిగా మంచి పేరున్న రఘు దీక్షిత్ గురించి కూడా చిన్మయి ఆరోపణలు చేయడం వ్యవహారాన్ని ఇంకాస్త ముదిరేలా చేస్తోంది. 

ఆన్ లైన్ లో చిన్మయికి మద్దతు భారీగా దక్కుతోంది. సిద్దార్థ్, సమంతా, వరలక్ష్మి శరత్ కుమార్ తనకు అండగా నిలబడుతున్నారు. చిన్మయి భర్త నటుడు కం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దీన్ని ఊరికే వదిలేది లేదు అంటున్నాడు. ఇటీవలే చిలాసౌతో డైరెక్టర్ గా డెబ్యూ తోనే సక్సెస్ అందుకున్నాడితను. ఇప్పుడు చిన్మయి వరస చూస్తుంటే ఇంకొన్ని సంచలనమైన పేర్లు బయటికి చెప్పేలా ఉంది.

మరోవైపు నానా పాటేకర్ కు మద్దతుగా వర్మ చేసిన ఓ వీడియో ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. మీ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపకూడదని సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపు అనే పదం వినిపించనంత గట్టిగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు పరిశ్రమ పెద్దలు. తనుశ్రీ దత్తా, కంగనా రౌనత్, అమైరా దస్తూర్ ఇలా ఒక్కొక్కరుగా సినిమా మృగాళ్లు తమ మీద జరిపిన దుశ్చర్యలను బయటపెడుతున్నారు. రానున్న రోజుల్లో ఇది ఇంకా కొత్త మలుపులు తిరిగేలా ఉంది. 

Image removed.

ReplyForward

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE