సన్నీ బికినీపై గరం గరం

Updated By VankayaFri, 10/12/2018 - 10:18
Sunny Leone

ఓపక్క సౌత్ లో సన్నీ లియోన్ వీరమాదేవి సినిమా చేయడం గురించి నిరసన వ్యక్తమవుతున్న టైంలో పుండు మీద  కారం చల్లుతున్నట్టు కావాలని బికినీ స్టిల్స్ ఇవ్వడం ఇప్పుడు మరిన్ని విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవలే భర్త పిల్లలతో కలిసి మెక్సికోకు హాలిడే కోసం వెళ్లిన సన్నీ అక్కడ బీచ్ ఒడ్డున తన అందాలు ఆరబోస్తూ  తీసుకున్న వైట్ అండ్ వైట్ బికినీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనను విపరీతంగా ఆదరించే రసిక ప్రియులు అభిమానులు ఎప్పటి లాగే వెల్కమ్ చెప్పారు కానీ మిగిలిన వర్గాల నుంచి మాత్రం సన్నీకి ట్రాలింగ్ ఎదురవుతోంది.

దానికి కారణాలు లేకపోలేదు.  ఒకపక్క శుభప్రదంగా భావించే నవరాత్రుల పండగ మొదలైన వేళ ఇలాంటి ప్రదర్శన ఏంటని కొందరు ప్రశ్నిస్తుండగా మరికొందరు దైవంతో సమానంగా సౌత్ లో పూజించే వీరమాదేవి పాత్రను పోషిస్తూ ఇవేం వేషాలు అంటూ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. నిజానికి సన్నీ ఇచ్చింది మాములు స్టిల్. ఇంతకు మించి ఇచ్చినవి గతంలో చాలా ఉన్నాయి. కానీ అప్పటి సందర్భానికి ఇప్పటి వాతావరణానికి చాలా తేడా ఉంది. 

కర్ణాటకలో ఇప్పటికే వీరమాదేవిని విడుదల చేయనివ్వం అంటూ కన్నడ సంఘాలు సన్నీ మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. మరోవైపు తమిళనాట కూడా దీని మీద వివాదం ఉంది. ఇలాంటి సమయంలో సుమారు 70 -80 కోట్ల దాకా బడ్జెట్ తో రూపొందుతున్న వీరమాదేవి టైటిల్ రోల్ పోషిస్తున్న సన్నీ లియోన్ ఈ కొంత కాలమైనా సైలెంట్ గా బాగుండేది. బయట బట్టలు లేకుండా తిరుగుతూ నిండుగా తెరమీద మాత్రమే దేవతలా కనిపిస్తాను అంటే జనం ఒప్పుకోరు.

ఒకప్పుడు ఎన్టీఆర్ కృష్ణుడు లేదా రాముడు పాత్ర వేస్తున్నప్పుడు మాంసాహారం మందు లాంటివి మానేసేవారట. పవిత్రత కోసం. మరీ అంత అవసరం లేకపోయినా జనంలో ఉన్న సున్నిత భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని అయినా సన్నీ లియోన్ కాస్త చూసుకుని ఇలాంటి ఫోటోలు పెడితే బెటర్. లేకపోతే వీరమాదేవి రిలీజ్ టైంలో ఇవే విడుదల అడ్డంకికి ఆయుధాలుగా మారతాయి. 
 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE