తొలిరోజే ‘అరవింద సమేత’ పైరసీ బయటకు..

Updated By VankayaThu, 10/11/2018 - 14:30
Aravinda sametha piracy out in first day

ఎన్నో అంచనాల మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందు వచ్చిన అరవింద సమేత సినిమాకు పైరసీ బెడద తప్పలేదు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించడం, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడంతో అభిమానుల్లో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అంతకు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్లు కూడా సినిమాకు బాగా బూస్టింగ్ నిచ్చాయి.

కాగా, అన్ని థియోటర్లలో చాలా వరకు ఆన్ లైన్ లోనే బుక్కవగా, మరికొంత మంది ఆఫ్ లైన్ లో టిక్కెట్ల కోసం పోటీపడ్డారు. బెనిఫిట్ షో నుంచి అభిమానుల కోలాహలం కనిపించింది. ఈ క్రమంలో అభిమాన నటుడు ఎంట్రీ నుంచి ఊపేసే డైలాగుల వరకు అందరిలోని ఆసక్తి నెలకొంది.

అయితే, ఆ సన్నివేశాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలయ్యాయి. అర్థరాత్రి 12.30కు వేసిన బెన్ ఫిట్ షో తరువాత అందరి చేతిలోనూ చిన్న చిన్న క్లిప్పింగులు, ఫొటోలు దర్శనమిచ్చాయి. ‘నేను సినిమా చూస్తున్నా.. నాకు టిక్కెట్ దక్కింది ’ అంటూ థియేటర్లలో నుంచే చాలా మంది యువకులు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా అందరికీ షేర్ చేయడం ప్రారంభించేశారట.

ఇలా ప్రతి ఒక్క సీన్ బయటకు వచ్చేయడంతో అందరూ ఫోన్లలో ఆసక్తిగా గమనిస్తూ కూర్చున్నారు. ఈ తరహా పైత్యం ఈ ఒక్క సినిమాకే కాదు బాహుబలి కంక్లూజన్, భరత్ అనే నేను, రంగస్థలం సినిమాలకు తప్పలేదు. పైరసీపై సినిమా తారలు గళం విప్పుతున్నా ఎవరూ వినే పరిస్థతి కనిపించడం లేదు. చివరికి స్మార్ట్ ఫోన్లను కూడా సినిమా థియేటర్లలోకి తీసుకెళ్లనీయకుండా బ్యాన్ చేయాల్సి వచ్చిదేమో.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE