మావోయిస్టుల కోసం వేట మొదలైంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములును హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్న క్లూస్ టీం అన్ని రకాలైన ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో సంఘటన స్థలంలో మావోలు ఎమ్మెల్యేను చుట్టు ముట్టిన విజువల్స్ బయటకు వచ్చాయి.

ఏపీ, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా రాష్ట్రాల సీఆర్పీఎఫ్, ఏపీ గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు నలు వైపుల నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు.  ఉత్తర తెలంగాణాలో కూడా హై అలర్ట్ ప్రకటించడంతో ఎప్పడు ఏం జరుగుతందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.

తెలంగాణలో మళ్లీ అధికారం చేపట్టేది కేసీఆర్ అనే మాట గట్టిగానే వినిపిస్తోంది. వివిధ వార్తా సంస్థల సర్వేలు ఇదే మాట చెబుతున్నాయి. జనప్రభల్యంలోనూ ఇదే మాటే వినిపిస్తోంది. మళ్లీ కేసీఆర్ అని అంటున్నారు అంతా. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిణామాలను గమనించినా.. మళ్లీ కేసీఆర్ నెగ్గుతాడేమో అనిపించక మానదు. దీనికి ప్రధానమైన కారణం.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు!

మాజీ సివిల్ సర్వెంట్లు.. ప్రత్యేకించి కీలకమైన శాఖల్లో పని చేసిన పోలీసు అధికారులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుండటం ఆసక్తిదాయకంగా మారింది. చంద్రబాబు వద్ద వ్యక్తిగత భద్రతా కార్యదర్శిగా పని చేసిన ఒక మాజీ పోలీస్ అధికారి దగ్గర నుంచి పలువురు సీనియర్ పోలీసాఫీసర్లు ప్రతిపక్ష పార్టీలో చేరిపోతున్నారు. జగన్ ఆధ్వర్యంలో వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకుంటున్నారు. 

తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల మధ్యన సీట్ల బేరం కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో ఇప్పటి వరకూ చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనిపించడం లేదు. ఒకవైపు చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉన్నాడు. పర్యటనను కొనసాగిస్తూనే చంద్రబాబు నాయుడు సీట్ల బేరాన్ని సాగిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే తెలంగాణలోని తమ పార్టీ వాళ్లకు చంద్రబాబు నాయుడు సూఛాయగా చెప్పాడట. కనీసం ముప్పై సీట్లు అడుగుతోందట తెలుగుదేశం పార్టీ. ఈ ప్రచారం మొదటి నుంచి సాగుతున్నదే.

ఉదయం లేస్తే మంత్రి దేవినేనికి జగన్ పేరే  ధ్యానం.  అనునిత్యం జగన్ జగన్ అంటూ ఉంటాడు. గత నాలుగేళ్లలో దేవినేని ఉమ జగన్ పేరును ధ్యానించినన్ని సార్లు మరెవరూ ధ్యానించి ఉండరేమో. జగన్ కు ఏవేవో సవాళ్లు కూడా విసురుతూ ఉంటాడు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం..2018కే అని అప్పట్లో జగన్ కే సవాల్ విసిరాడు ఈ మంత్రిగారు. ఇక 2018 అయిపోతోంది.. పోలవరం ఎక్కడి వరకూ వచ్చిందో చెప్పే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయింది. 

ఒకవైపు రాష్ట్రంలో ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలనే చాలా సింపుల్‌గా చంపేస్తూ ఉన్నారు. ఇంకా ఉన్నారా? అని మొన్నటి వరకూ ప్రశ్నలు వేసుకున్న నక్సల్స్ గుంపుగా వచ్చి ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను దారుణంగా హత మార్చారు. ఇక వీరి హత్య జరిగిన వెంటనే మళ్లీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఏకంగా పోలిస్ స్టేషన్ మీదే దాడి జరిగింది. ఆ దాడిలో స్టేషన్‌ను నిలువునా తగలెట్టారు.

గోదావరి పుష్కర మరణాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఆ పాపం ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. టీడీపీ ప్రభుత్వం మీడియా పై తోసేయడం ఏమిటని ప్రశ్నించారు. అసలు మీడియాకు సంబంధం ఏమిటని అన్నారు.

2015 గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి లోని పుష్కర ఘాట్ లో భారీ స్థాయిలో తొక్కిసలాట జరిగింది. 29 మంది వరకు చనిపోయారు. ఆ సమయంలో చంద్రబాబు కుటుంబసమేతంగా పుష్కర స్నానం కోసం వీవీఐపీ ఘాట్ వద్దకు వచ్చారు. పవిత్ర స్నానాలు తదితరాలను చిత్రీకరించేందుకు, ప్రచారం కోసం టూరిజం శాఖ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ తో ఒప్పందం చేసుకుంది.

అద్బుతమైన రాజధాని కడుతున్నామంటూ చంకలు గుద్దుకుంటున్న ఏపీ ప్రభుత్వం ప్రజల కనీస వైద్య అవసరాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కేవలం అల్లోపతికే ప్రాధాన్యం ఇస్తుంది.  పురాతన వైద్య విధానాలకు కల్పిస్తున్న ప్రోత్సాహం శూన్యంగా ఉంది.  దీంతో ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు ఆస్పత్రులు వెలుస్తున్నాయి. ప్రజలను జలగల్లా పీల్చేస్తున్నాయి. 

దేశంలోని రాజకీయ నేతలందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. సుదీర్ఘమైన పాదయాత్రతో జగన్ చరిత్రలో కొత్త పేజీలను లిఖించుకుంటున్నాడు. ఇంత వరకూ దేశ రాజకీయ చరిత్రలో మరేనేతా నడవనంతటి దూరాన్ని నడుస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి. నేటితో జగన్ మోహన్ రెడ్డి మూడు వేల కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకోబోతోంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర. ఇంత వరకూ దేశ చరిత్రలో ఈ స్థాయిలో పాదయాత్రను చేసిన నేత మరెవరూ లేరని చెప్పవచ్చు.

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య దారుణమే. అది ఖండించదగినదే. ప్రజాస్వామ్యంలో హత్యలకు తావు లేదు. ఆయన ఏదైనా తప్పు చేసి ఉన్నా.. ఇలా శిక్షించే అధికారం అయితే మావోలకు లేదు. శిక్ష ప్రజాస్వామ్య యుతంగా పడాలి కానీ.. ఇలా తుపాకీతో కాదు.

కానీ..గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే.. ఈ ఎమ్మెల్యే వాస్తవానికి గెలిచింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అరకు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఈయన నెగ్గాడు. అయితే చంద్రబాబు నాయుడు వలలో చిక్కుకున్నాడు. వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరాయించాడు. ఈ ఫిరాయింపు వల్ల సర్వేశ్వరరావుకు ఏమైనా దక్కిందో లేదో కానీ.. ఇప్పుడు ఫిరాయించడమే ప్రాణాల మీదకు తెచ్చింది.

గత కొన్నాళ్లుగా పురందేశ్వరి విషయంలో గట్టిగా వినిపించిన మాట.. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరుతుంది అనేది. గత ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలో చేరిన ఆమె ఈ సారి మరోసారి పార్టీ మారుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుందని ప్రచారం జరిగింది. దానికి అనుబంధంగా చాలా వార్తలే వచ్చాయి. పురందేశ్వరి వచ్చి చేరితే జగన్ సీటు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడని ప్రచారం జరిగింది. 

అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికేమో ఇప్పుడు కామ్ అయిపోయారు. బాబ్లీ వ్యవహారం తమకు రాజకీయంగా ఉపయోగకరంగా మారిందని తెలుగుదేశం పార్టీ నేతలు భావించారు కానీ.. ఇది అంతిమంగా తమకు రాజకీయంగా నష్టం కలిగించేదే అని స్పష్టం అయిపోయింది. అందుకే ఇప్పుడు పచ్చ పార్టీ వాళ్లు కామ్ అయిపోయారు. బాబ్లీ వ్యవహారం ఇప్పటిదేమీ కాదు. అయితే ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని తెలుగుదేశం అధినేత ఎత్తుగడ వేశాడు. తను తెలంగాణ కోసం పోరాడాను అని.. తనను వైఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని..ఇలా చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టుగా చెప్పుకున్నాడు.

తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ జట్టుకట్టింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఏపీలోనూ అమలు చేసి కాంగ్రెస్ కు పూర్వవైభవం తేవాలని  ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిసైడ్ అయినట్టు సమాచారం. ఆంద్ర ప్రదేశ్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ క్యాడర్ లో జీవం పోసేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేలా దిశా నిర్దేశం చేయనున్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర విభజన హామీల అమలు, ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చేస్తానని ఇప్పటికే ప్రకటించారు.

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు మరో దారుణానికి ఒడిగట్టారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే శివారి సోములను పాయింట్ బ్లాంక్  రేంజ్ లో కాల్చి చంపారు. అరకు పరిధిలోని డుంబ్రిగూడ మండలం తుటంగి వద్ద ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సర్వేలపైనే ఆధారపడ్డాయి. గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలన్న ధోరణిలో ఉన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత ఇప్పటికే సర్వేలు చేసి టికెట్లు ఇచ్చేశారు. కాంగ్రెస్ కూడా అంతర్గత సర్వేలు చేయిస్తోందట.. ఇప్పుడు ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రేవేటు ఏజన్సీలతో సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నాయి. అభ్యర్థులు జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాయి. కొంచెం ఆర్థిక స్థోమత, సామాజిక బలం ఉన్న చోట ముందుగానే అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. మరికొన్ని చోట్ల అభ్యర్థులను మార్చే పనిలో ఉన్నారు.

YOU MAY LIKE