మహాకూటమి.. సీట్ల ఒప్పందం, అలా ఖరారు?

Updated By VankayaTue, 10/09/2018 - 18:15
Stalemate: Mahakutami yet to decide on seat sharing

తెలంగాణలో మహాకూటమి తరఫున సీట్ల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ముందుగా అనుకున్నట్టుగానే ఈ కూటమిలోని పార్టీలు సీట్ల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చాయట. తమకు కనీసం 30 సీట్లు కావాలని ఒక దశలో డిమాండ్ చేసింది తెలుగుదేశం పార్టీ. అయితే ముప్పై కుదరదు పదిహేను అని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. చివరకు తెలుగుదేశం పార్టీ కూడా ఇందుకు సమ్మతం తెలియజేసిందని సమాచారం.

ఇక తెలుగుదేశం పార్టీ కన్నా ఒక సీటు ఎక్కువే కానీ, తక్కువకు ఒప్పుకునేది లేదు అని వాదించిన తెలంగాణ జనసమితి చివరకు మూడు సీట్లకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. మూడు సీట్లను ఈ పార్టీకి కేటాయిస్తోందట కాంగ్రెస్.

అలాగే కమ్యూనిస్టు పార్టీకి ఐదు సీట్ల వరకూ ఓకే చేసిందని సమాచారం. ఒక దశలోఈ పార్టీలన్నీ భారీగా సీట్లను డిమాండ్ చేశాయి. చివరకు మాత్రం కాంగ్రెస్ ప్రతిపాదనలకే ఓకే చెప్పాయి.

సీట్ల లెక్క విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది కానీ.. ఇక ఏ సీటు ఎవరికి? అనే అంశంపై కసరత్తు సాగాల్సి ఉంది. ఈ విషయంలో కూడా తీవ్రమైన పోటీ ఉంది. కొన్ని సీట్ల విషయంలో అన్ని పార్టీలో పోటీలు పడుతున్నాయి. కచ్చితంగా తెరాస ఓడిపోతుంది అనే సీట్ల విషయంలో మూడు పార్టీల మధ్యన తీవ్రమైన పోటీ నెలకొంది. ఆ సీట్లు తమకు కావాలంటే తమకు అని ఈ పార్టీలు పోటీలు పడుతున్నాయి. మరి ఈ వ్యవహారం ఎలా కొలిక్కి వస్తుందో చూడాలి.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE