మహాకూటమి.. తెలుగుదేశం టెన్షన్ మాత్రమేనా!

Updated By VankayaFri, 10/12/2018 - 13:27
TDP

విదిల్చినన్ని సీట్లు మాత్రమే విదుల్చుతాం.. ఉంటే ఉండండి.. లేకపోతే పొండి.. అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్లు. తెలంగాణలో తాము బలమైన శక్తులం అని అంటున్న తెలుగుదేశం పార్టీకే వాళ్లు ఈ మాట చెబుతున్నారు. ఒక దశలో నలభై సీట్లలో తాము బలంగా ఉన్నామని చెప్పుకున్న తెలుగుదేశం వాళ్లు చివరకు పదిహేను సీట్లకు సర్దుకుపోయే పరిస్థితి వచ్చేసింది. 

ఆ పదోపదిహేనో సీట్లకే ఆనంద పడే పరిస్థితికి వచ్చింది. తెలుగుదేశం కథేమో కానీ.. మహాకూటమిలో తెలంగాణ జనసమితి మాత్రం బాగానే అలజడి రేపుతోంది. తమకు కోరినన్ని సీట్లు ఇవ్వాలని కోదండరాం పట్టుపడుతున్నాడు. ఈ విషయంలో రాజీ పడేది లేదని అంటున్నాడు. సీట్ల సంగతి త్వరగా తేల్చాలని లేకపోతే సొంతంగా అభ్యర్థులను ప్రకటించేస్తాం అన్నట్టుగా కోదండరాం వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు.

మరోవైపు కోదండరాం బీజేపీతో చెలిమికి కూడా రెడీ అయిపోతున్నాడని వార్తలు  వస్తున్నాయి. కాంగ్రెస్ కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే కోదండ బీజేపీతో చేతులు కలిపే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ కూడా సానుకూలంగా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో కోదండ మహాకూటమి నుంచి బయటకు వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ చర్చలు ప్రారంభించిందట. ఆయనను బతిమాలి, బుజ్జగించి కూటమిలోనే ఉండేట్టు చూసుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.

ఇంతజేసీ మహాకూటమిలో తెలుగుదేశం పార్టీది చాలా చిన్న పాత్ర మాత్రమే. పదిహేను సీట్లు అంటే పెద్ద లెక్కలోనివి కావు. వాటిల్లో ఎన్ని సీట్లను ఈ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి.

అయినప్పటి కూటమి కోసం తెలుగుదేశం పార్టీ చాలానే కష్టపడుతోంది. కోదండరాంను బుజ్జగిస్తోంది. ఒక దశలో తెలంగాణలో వెలుగు వెలిగిన పార్టీ తెలుగుదేశం. అలాంటిది ఇప్పుడు మరీ ఇలాంటి పరిస్థితిలోకి రావడం విశేషమే.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE