నెగిటివ్ సర్వేల నేపథ్యంలో.. టీడీపీ అలా!

Updated By VankayaFri, 10/12/2018 - 13:33
chandra babu

వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని జాతీయ స్థాయి సర్వేలు చెబుతున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభంజనమే అని కూడా ఒక టీవీ చానల్, ఒక సర్వే సంస్థ ఉమ్మడి సర్వే తేల్చి చెప్పింది. ఏకంగా 21 ఎంపీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకునే అవకాశాలున్నాయని ఆ సంస్థ విశ్లేషించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వీటి పట్ల అధికారికంగా స్పందించడం లేదు.

మామూలుగా ఇలాంటి సర్వేలకు తెలుగుదేశం చాలా విలువనే ఇస్తుంది. అయితే ఈ సారి మాత్రం ఆ సర్వే పట్ల చంద్రబాబు కానీ, ఇతర టీడీపీ నేతలు కానీ స్పందించడం లేదు. తమకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపై విరుచుకుపడుతూ మాట్లాడే టీడీపీ నేతలు ఏకంగా 21 ఎంపీ సీట్లను టీడీపీ కోల్పోతుంది అనే వార్తలు వస్తున్న తరుణంలో కూడా మాట్లాడకపోవడం విశేషమే.

అయితే ఈ సర్వేలను తెలుగుదేశం మరో రకంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. అభ్యర్థుల ప్రకటన.. అభ్యర్థుల విషయంలో చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చేశాడు.. తరహా మాటలతో తెలుగుదేశం వాళ్లు నెగిటివ్ సర్వేలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చాలా మంది సిట్టింగులకు చంద్రబాబు నాయుడు టికెట్లను ఖరారు చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి టీడీపీ అనుకూల పత్రికలు

ఎంపీ సీట్ల విషయంలో తెలుగుదేశం చిత్తయిపోతుంది అనే సర్వేలు వచ్చిన తరుణంలో.. ఎంపీ టికెట్ల విషయంలో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసేసుకున్నాడని అనుకూల మీడియా వర్గాలు ప్రచారం చేసి పెడుతున్నాయి. తద్వారా డ్యామేజీ నియంత్రణ చేస్తున్నాయి. అయితే టీడీపీ అనుకూల పత్రికల్లో వస్తున్నట్టుగా పరిస్థితి లేదని.. సర్వేలతో చాలా మంది తెలుగుదేశం సిట్టింగు ఎంపీలు భయపడుతున్నారని.. ఓడిపోతామనే విశ్లేషణల మధ్యన పోటీకి కొందరు పూర్తిగా వెనుకడుగు వేస్తున్నారని కూడా తెలుగుదేశం నుంచినే గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE