పవన్ మనస్తత్వం ఇంత నీఛమా?!

Updated By VankayaWed, 10/10/2018 - 12:18
pawan kalyan

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలవుతున్నాయి. జగన్ పాదయాత్రలో భాగంగా సామాన్యంతో మమేకం అవుతుండటాన్ని పవన్ కల్యాణ్ తప్పు పట్టాడు. జగన్ లాగా ముద్దులు పెట్టడానికి తను రాలేదని నీఛంగా మాట్లాడాడు పవన్ కల్యాణ్. సామాన్యులను, ఆర్తులను, బాధితులను.. జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నాడు. చాలా మంది డబ్బున్న వాళ్లు.. అహం ఉన్న బీదాబిక్కిని తాకడానికి కూడా ఇష్టపడరు. అయితే జగన్ మాత్రం సంవత్సరాలుగా వారి మధ్యనే గడుపుతూ ఉన్నాడు.

అయితే జగన్ ముద్దులు పెడుతున్నాడని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం అత్యంత హేయం అని చెప్పాలి. జనసేన అధినేత మనస్తత్వం ఎలాంటిదో ఈ  మాటలే చెబుతున్నాయి. తనది నీఛ మనస్తత్వం అని, జగన్ ఆప్యాయంగా పలకరించడాన్ని కూడా తప్పు పట్టే నైజం అని పవన్ కల్యాణ్ చాటుకుంటున్నాడు.

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని స్త్రీ సాధికారత గురించి మాట్లాడతాడు పవన్ కల్యాణ్. స్త్రీ లోలుడుగా విమర్శలను ఎదుర్కొంటూ ఉంటాడు. ఇప్పుడు జగన్ ఆప్యాయతలో కూడా పవన్ కల్యాణ్ కామాన్ని చూస్తున్నాడు. తను ముద్దులు పెట్టేందుకు రాలేదన్నాడు.

అయినా పీడతబాధిత వర్గాలకు ఎందుకు ముద్దులు పెడతాడు పవన్ కల్యాణ్.. ఈయన ముద్దులు పెట్టడానికి హీరోయిన్లు ఉంటారు. వారితో అయితే లిప్ లాక్ లు వేసుకుని పండగ చేసుకుంటాడు. అదే సామాన్యలను మాత్రం దగ్గరకు కూడా రానిచ్చే టైపు కాదు కదా.
 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE