ఔరౌరా.. చంద్రబాబు, ఏం గేమ్స్ ఆడుతున్నావు!

Updated By VankayaFri, 10/12/2018 - 14:35
chandra Babu

ఈ మాటే అనుకుంటున్నారు జనసామాన్యం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరును చూసి జనాలు విస్తుపోతున్నారు. ఆర్థిక సంఘం సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు పట్ల అంతా విస్మయులు అవుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు ఎవ్వరినైనా ఆశ్చర్యపరుస్తుంది. అంత విడ్డూరంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు.

ప్రత్యేకహోదా కావాలని బాబు అంటున్నాడు. అంతే కాదు.. ‘సమాయనుకూలంగా మాటలు మారుస్తోంది..’ అంటూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు చంద్రబాబు నాయుడు. ఎవరు సమాయానుకూలంగా మాటలు మారుస్తున్నారో.. అనే అంశం బాబు మాటలతోనే చర్చలోకి వస్తోంది.  ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా మాట్లాడాడో అందరికీ తెలిసిందే.

గత ఎన్నికల ముందేమో చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా అని అన్నాడు. హోదానే ప్రాణప్రదం అని చెప్పాడు. తమకు అధికారం ఇస్తే హోదా ఖాయమని చెప్పాడు. తమకూ, బీజేపీకి కలిపి అధికారం ఇవ్వాలని రాష్ట్రానికి దశాబ్దాల పాటు ప్రత్యేకహోదా వస్తుందని చంద్రబాబు ానయుడు ఎన్నికల హామీని ఇచ్చాడు. అయితే తీరా అధికారంలోకి రాగానే బాబు లెక్కలు మారిపోయాయి.

హోదా వద్దు అంటూ మొదలుపెట్టాడు. హోదాతో ఏమీ రాదు అన్నాడు. హోదాతో ఏమొస్తుంది అని ప్రశ్నించాడు. అంతేనా.. హోదా అంటే ఎవరినైనా జైలుకు పంపిస్తా అని కూడా బహిరంగంగా హెచ్చరించింది చంద్రబాబు నాయుడే. అయితే లోలోన ఏమైందో కానీ.. బీజేపీతో తెగదెంపులు చేసుకుని వచ్చాడు. అది కూడా అధికార కాలంలో నాలుగేళ్ల వ్యవధి ముగిశాకా. 

నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చి.. ఇప్పుడు మళ్లీ హోదా కావాలని అంటున్నాడు. కేంద్రం మోసం చేసిందని అంటున్నాడు. హోదా ఇవ్వలేదని వాపోతున్నాడు. ఇదీ చంద్రబాబు నాయుడు మాటలు మార్చిన తీరు. సమాయనుకూలంగా మాటలు మార్చిన, మారుస్తున్న వ్యక్తి చంద్రబాబు. తన తీరును కేంద్రానికి అంటగడుతూ చంద్రబాబు నాయుడు ఎదురుదాడి చేయడం ఎంతో విడ్డూరంగా ఉందని చెప్పనక్కర్లేదు.
 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE