ఏపీ కాంగ్రెస్ తీరు.. ఇంతకు మించిన కామెడీ లేదు!

Updated By VankayaFri, 10/12/2018 - 14:23
Rahul Gandhi, Raghu Veera Reddy

రెండు రోజుల క్రితం భారీ జోకులు వేశాడు కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి. కేంద్రంలో అధికారం అందుకుంటామని.. రాష్ట్రంలో కూడా అధికారాన్ని సొంతం చేసుకుంటామని రఘువీర అన్నాడు. ఇంకా నయం.. తనే ముఖ్యమంత్రిని అవుతానని రఘువీరారెడ్డి అనలేదు. తను కాకపోతే తమ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని కూడా చెప్పలేదు. రఘువీరారెడ్డి కామెడీ అంతటితోనే ఆగింది.

ఆ సంగతలా ఉంటే.. ఏపీలో అధికారాన్ని అందుకుంటామని రఘువీరా ప్రకటించి రెండు రోజులు అయినా గడిచాయో లేదో కానీ.. తాజాగా మరో రాజీనామా. ఈ సారి వంతు నాదెండ్ల మనోహర్ ది. ఈయన ఇది వరకే ఒకసారి పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యాడు. అప్పుడే పార్టీని వీడతాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవే నిజం అవుతున్నాయి. నాదెండ్లను అవకాశవాదిగా అభివర్ణించాడు రఘువీరారెడ్డి. అయినా నాలుగేళ్లు పని చేశాడు కదా.. ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయనకు అర్థం అయ్యింది. దీంతో రాజీనామా చేసి వెళ్లిపోతూ ఉన్నాడని అనుకోవాలి.

మరి ఇంతోటి పార్టీ ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకుంటుందని రఘువీరారెడ్డి చెప్పుకురావడానికి మించిన కామెడీ ఏముంది. ఇక తాజాగా ఏపీ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో కూడా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ కాంగ్రెస్ కు దిశానిర్దేశం చేశాడట. 

దాని ప్రకారం.. వెళ్లిపోయే వాళ్లు వెళ్లిపోవచ్చు అని, మిగతా వాళ్లు పని చేయాలని రాహుల్ చెప్పాడట. ఇక మిగిలిన వాళ్లలో కూడా మంచి అవకాశాలు వచ్చిన వాళ్లు జంపింగ్ అయిపోతారని చెప్పనక్కర్లేదు. అలాగే తెలుగుదేశంతో పొత్తు విషయంలో తను నిర్ణయం తీసుకుంటానన్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పాడట.
 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE