కేంద్ర మంత్రి అక్బర్ పై ‘మీ టూ’ ఎఫెక్ట్

Updated By VankayaFri, 10/12/2018 - 14:51
MJ Akbhar

కేంద్ర మంత్రి అక్బర్ పై ఆరోపణలు పెచ్చుమీరుతున్నాయి. దేశంలో ప్రస్తుతం చెలరేగుతున్న ‘మీ టూ’ ఉద్యమానికి ఆయన బారిన పడిన మహిళా ఉద్యోగులు గళం విప్పారు. దీనిపై నోరు మెదపని బీజేపీ నేతలు, ఆయన చేత రాజీనామా చేయించడమే పరిష్కారంగా భావిస్తున్నాయి.

ఎంజే అక్బర్ అందరికీ సుపరిచితుడైన పేరు. ఈయన వ్యక్తిగతంగా చాలా మంది తెలుసు. జర్నలిస్టుగా పనిచేసిన వ్యాసాలు దక్కన్ క్రానికల్లో వచ్చేవి. వాటిని తెలుగులో అనువాదం చేసుకొని పత్రికలు అచ్చు వేయించుకునేవారు. అక్బర్ బీజేపీ ప్రభుత్వంలో సహాయ కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. అంతకు ముందు డెక్కన్ క్రానికల్ పత్రిక లో పనిచేసేవారు. ఆయన ఎప్పుడు బీజేపీని పొగుడుతూ వ్యాసాలు రాయలేదు. అలాగని వ్యతిరేకంగానూ లేవు.

కేంద్ర మంత్రి అయిన తరువాత అక్బర్ పత్రికల్లో వ్యాసాలు రాయడం చాలా వరకు మానేశారు. ఇప్పుడు ఆయనపై వస్తున్న ఆరోపణలు ఇప్పటివి కావు. డీసీలో పనిచేస్తున్నప్పటివే. ఆయన దగ్డరకు వచ్చిన మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించేవారట. అసభ్యంగా మాట్లడటం, చేష్టలు చేయడం, లో దుస్తుల్లో చేతులు పెట్టడం లాంటివి చేసేవారని ఒక్కొక్క విషయాన్ని బయటకు పెడుతున్నారు.అంతేగాక, అక్బర్ పంజాబ్ నుంచి అందమైన అమ్మాయిలను తీసుకువచ్చి, అవసరమైన వారి దగ్గరకు పంపుతూ ఉండేవాడని కూడా కొంత మంది ఉద్యోగులు వెల్లడిస్తున్నారు.

ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా, అక్బర్ మాత్రం స్పందించడంలేదు. బీజేపీ అధిష్ఠానం ఈ విషయమై బహిరంగంగా మాట్లాడకపోయినా, తీవ్ర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది మరింత తీవ్రమయ్యేలోగా నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని భావిస్తుందట. అందులో భాగంగా ఆయన పదవికి రాజీనామా చేయించాలని అనుకుంటున్నట్టు భోగట్టా.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE