కేటీఆర్ సెటైర్ చూసైనా మారండి ఉత్త‌మ్‌జీ

Updated By VankayaFri, 10/12/2018 - 09:56
KTR , Uttam Kumar Reddy

తెలంగాణ‌లో రాజ‌కీయ విమ‌ర్శ‌ల జోరు పెరుగుతోంది. ఆయా పార్టీలు త‌మ త‌మ విమ‌ర్శ‌ల‌కు ప‌దునుపెడుతూ ముందుకు సాగుతున్నాయి. అనూహ్య రీతిలో ముంద‌స్తుఅదే రీతిలో 105 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్ర‌చారంలో దూసుకుపోతోంది. తాజాగా ఆ పార్టీ యువ‌నేత‌, అప‌ద్ధ‌ర్మ‌ మంత్రి కేటీఆర్ త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిపై సెటైర్లు వేశారు. ఇటు బీజేపీని అటు కాంగ్రెస్‌ను క‌లిపి విమ‌ర్శించారు. కేటీఆర్ కామెంట్‌తో అయినా తమా పార్టీ మార‌తుందేమో అనే ఆలోచ‌న కాంగ్రెస్ నేత‌ల‌కు వ‌చ్చిందంటే ప‌రిస్థ‌తి అర్థం చేసుకోవ‌చ్చు.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప‌ర్య‌ట‌న నేప‌థ్యం, ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించిన క్ర‌మంలో వేములవాడలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ నేత‌ల‌పై మండిప‌డ్డారు. పాడిందే పాడరా అన్నట్టు అమిత్‌షా  కరీంనగర్లో మాట్లాడారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ``రాష్ట్రాలు లేనిదే కేంద్రం లేదు. రాష్ట్రాలు పన్నులు కట్టకపోతే కేంద్రం లేదు. కేంద్రానికి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పన్ను తెలంగాణ నుండి కడుతున్నాం. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన దాని కంటే ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్న IT రంగంలో, విద్యుత్ రంగంలో సమస్యలు పరిష్కారం చేసుకున్నాం`` అని వివ‌రించారు.

“అమిత్‌షాను సవాల్ చేస్తున్నా. రాం మందిర్ పేరుతో మతాల మధ్య చిచ్చు పెట్టి, కనీసం రాం మందిర్ కూడా కట్టలేదు. అన్ని మతాల వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదరిస్తుంది. నిజమైన సెక్యులర్ పార్టీ, దేశానికి ఆదర్శం మా టీఆర్ఎస్`` అని కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాల‌ను బీజేపీ కేంద్ర మంత్రులు చూసి వారి రాష్ట్రాల్లో అమలు చేస్తామన్నారని కేటీఆర్‌ గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని స్థానాల్లో డిపాజిట్ వస్తాయో చూస్తాం. తెలంగాణ లో అమిత్ షా షో లు నడవవు. 5 సీట్లు తెచ్చుకోండి చూద్దాం. ఇంకా 9 నెలల సమయం ఉంది. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చండి`` అంటూ కేటీఆర్ ఎత్తిపొడిచారు. 

ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేత‌ల మ్యానిఫెస్టో అమ‌లు చేయాలంటే ఆరు రాష్ర్టాల బ‌డ్జెట్ కావాల‌ని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీకే ప్ర‌జ‌లు అండ‌గా నిలుస్తున్నార‌ని, ప్ర‌చారంలో ఇది స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని కేటీఆర్ తెలిపారు. ``కాంగ్రెస్ వాళ్లు సీట్ల పంపిణీ చేసే లోపు మేము స్వీట్ల పంపిణీ చేసుకుంటాం” అని కేటీఆర్ అన్నారు. కాగా, త‌మ అభ్య‌ర్థుల ఖ‌రారు విష‌యంలో సుదీర్ఘ జాప్యం జ‌ర‌గ‌డం చూస్తుంటే... ఇదే నిజ‌మ‌న్న‌ట్లుగా ఉంద‌ని కాంగ్రెస్ నేత‌లే వ్యాఖ్యానిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE