రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మూవీగా బోయపాటి శీను చేస్తున్న ప్రాజెక్ట్ మీద అభిమానుల్లోనే కాదు ట్రేడ్ లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇందులో కూడా తన ట్రేడ్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఇంకా భారీ స్థాయిలో చిత్రీకరించాడన్న వార్తలు ఇప్పటికే ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేస్తున్నాయి. ఇకపోతే దీనికి టైటిల్ ఫిక్స్ అయ్యింది అంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం  పెద్ద చర్చకే దారి తీసింది. 

మావోయిస్టుల కోసం వేట మొదలైంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములును హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్న క్లూస్ టీం అన్ని రకాలైన ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో సంఘటన స్థలంలో మావోలు ఎమ్మెల్యేను చుట్టు ముట్టిన విజువల్స్ బయటకు వచ్చాయి.

ఏపీ, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా రాష్ట్రాల సీఆర్పీఎఫ్, ఏపీ గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు నలు వైపుల నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు.  ఉత్తర తెలంగాణాలో కూడా హై అలర్ట్ ప్రకటించడంతో ఎప్పడు ఏం జరుగుతందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.

ఈ ఏడాదిలో చివరి మూడు నెలలే మిగిలి ఉన్న నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ దగ్గర రానున్న రోజుల్లో జరగబోయే పోటీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ లో అరవింద సమేత వీర రాఘవ ఒక్కటే భారీ హైప్ ఉన్న మూవీ కాగా ఆ తర్వాత స్థానాల్లో నోటా, పందెం కోడి 2, హలో గురు ప్రేమ కోసమే లాంటివి నిలుస్తున్నాయి. కానీ ఆ తర్వాత  వచ్చే నవంబర్ మాత్రం చాలా స్పెషల్ గా ఉండబోతోంది. కారణం ఆయా హీరోలకు కెరీర్  బెస్ట్ అనిపించే మూవీస్ ఆ నెలలోనే వస్తుండటం. 

ప్రస్తుత ఎన్నికల సీజన్లో దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కీలక తీర్పును మంగళవారం సుప్రీం కోర్టు వెలువరించింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులు దోషులుగా తేలిక ముందే అనర్హత వేటు వేయలేమని స్పష్టం చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైతే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటీషన్ పై సర్వోన్నత న్యాయ స్థానం ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని పార్లమెంటుకే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది.

తెలంగాణలో మళ్లీ అధికారం చేపట్టేది కేసీఆర్ అనే మాట గట్టిగానే వినిపిస్తోంది. వివిధ వార్తా సంస్థల సర్వేలు ఇదే మాట చెబుతున్నాయి. జనప్రభల్యంలోనూ ఇదే మాటే వినిపిస్తోంది. మళ్లీ కేసీఆర్ అని అంటున్నారు అంతా. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిణామాలను గమనించినా.. మళ్లీ కేసీఆర్ నెగ్గుతాడేమో అనిపించక మానదు. దీనికి ప్రధానమైన కారణం.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు!

మాజీ సివిల్ సర్వెంట్లు.. ప్రత్యేకించి కీలకమైన శాఖల్లో పని చేసిన పోలీసు అధికారులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుండటం ఆసక్తిదాయకంగా మారింది. చంద్రబాబు వద్ద వ్యక్తిగత భద్రతా కార్యదర్శిగా పని చేసిన ఒక మాజీ పోలీస్ అధికారి దగ్గర నుంచి పలువురు సీనియర్ పోలీసాఫీసర్లు ప్రతిపక్ష పార్టీలో చేరిపోతున్నారు. జగన్ ఆధ్వర్యంలో వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకుంటున్నారు. 

తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల మధ్యన సీట్ల బేరం కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో ఇప్పటి వరకూ చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనిపించడం లేదు. ఒకవైపు చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉన్నాడు. పర్యటనను కొనసాగిస్తూనే చంద్రబాబు నాయుడు సీట్ల బేరాన్ని సాగిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే తెలంగాణలోని తమ పార్టీ వాళ్లకు చంద్రబాబు నాయుడు సూఛాయగా చెప్పాడట. కనీసం ముప్పై సీట్లు అడుగుతోందట తెలుగుదేశం పార్టీ. ఈ ప్రచారం మొదటి నుంచి సాగుతున్నదే.

పెళ్లయ్యాక కూడా జోరు తగ్గని సమంతాకు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో హ్యాట్రిక్స్ కొట్టిన సామ్ రంగస్థలం, మహానటి, అభిమన్యుడు సక్సెస్ లతో  మాంచి హుషారుగా ఉంది. కాకపోతే ఈ నెలలో తెలుగులో వచ్చిన యుటర్న్, తమిళ్ లో చేసిన సీమరాజా ఆశించిన ఫలితాలు అందుకోలేదు. కమర్షియల్ గా విజయం సాధించడంలో ఫెయిల్ అయ్యాయి. వీటి తర్వాత నాగ చైతన్యతో శివ నిర్వాణతో ఓ సినిమా చేయబోతున్న సామ్ అది కాకుండా మరో వెరైటీ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 

ఉదయం లేస్తే మంత్రి దేవినేనికి జగన్ పేరే  ధ్యానం.  అనునిత్యం జగన్ జగన్ అంటూ ఉంటాడు. గత నాలుగేళ్లలో దేవినేని ఉమ జగన్ పేరును ధ్యానించినన్ని సార్లు మరెవరూ ధ్యానించి ఉండరేమో. జగన్ కు ఏవేవో సవాళ్లు కూడా విసురుతూ ఉంటాడు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం..2018కే అని అప్పట్లో జగన్ కే సవాల్ విసిరాడు ఈ మంత్రిగారు. ఇక 2018 అయిపోతోంది.. పోలవరం ఎక్కడి వరకూ వచ్చిందో చెప్పే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయింది. 

ఒకవైపు రాష్ట్రంలో ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలనే చాలా సింపుల్‌గా చంపేస్తూ ఉన్నారు. ఇంకా ఉన్నారా? అని మొన్నటి వరకూ ప్రశ్నలు వేసుకున్న నక్సల్స్ గుంపుగా వచ్చి ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను దారుణంగా హత మార్చారు. ఇక వీరి హత్య జరిగిన వెంటనే మళ్లీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఏకంగా పోలిస్ స్టేషన్ మీదే దాడి జరిగింది. ఆ దాడిలో స్టేషన్‌ను నిలువునా తగలెట్టారు.

హుల్ దివస్ కు ప్రభుత్వం సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తమ భాషకు గుర్తింపు ఇవ్వాలని కోరుతూ కోల్ కతాలోని బీజేఎంపీఎం సంస్థ నిర్వహిస్తున్న ఆందోళన ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా పడింది. రైల్ రోకోతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

1855-56 మధ్యకాలంలో జరిగిన సంతల్ తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయిన తమ పూర్వీకుల స్మారకార్థం ప్రతి ఏటా జూన్ 30న కోల్ కొతా వెస్ట్ మిడ్నాపుర్ గిరిజనులు హుల్ దివస్ నిర్వహిస్తుంటారు. తమ సంప్రదాయక భాష ‘అల్చి’ని గుర్తించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. రెండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందంటూ గిరిజనులు ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నారు.

తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక్కడ ఏ కొత్త సినిమా విడుదలైనా దాని మీద బాలీవుడ్ పెద్దలు కన్నేసి ఉంచుతున్నారు అంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆరెక్స్ 100 రీమేక్ ని ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్  సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. సుమారు రెండు కోట్ల దాకా రీమేక్ హక్కుల కోసం ఒప్పందం జరిగినట్టు సమాచారం. అంటే సినిమా తీయడానికి అయిన బడ్జెట్ ఈ రూపంలోనే వచ్చేసింది. మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందేలా ప్లానింగ్ జరుగుతోంది.

సినిమాల్లో ఎంత పెద్ద పేరున్నా బయట కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు నిజమైన హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కొందరు మాత్రం వాస్తవిక ప్రపంచంలో కూడా అదే భ్రమల్లో బ్రతుకుతూ పరువుతో పాటు తమ అభిమానుల ప్రేమను కూడా తాకట్టు పెట్టుకుంటారు. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఇప్పుడు అలాంటి చిక్కుల్లోనే పడ్డాడు. ప్రస్తుతం జైలులో రిమాండ్ కింద ఉన్న ఇతగాడు ఒక జిమ్ ట్రైనర్ ని కిడ్నాప్ చేసి తీవ్రంగా హింసించిన కేసులో అభియోగాలు ఎదురుకుంటున్నాడు. శశికళ ఉన్న పరప్పన అగ్రహారం జైలులో ప్రస్తుతం ఖైదీగా ఉన్నాడు. వాయిదా కారణంగా మరో రెండు రోజులు అక్కడే గడపాల్సి ఉంటుంది.

గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న ప్రణయ్ హత్యోదంతం తాలూకు జ్ఞాపకాలు ఇంకా చర్చల్లో ఉంటూనే ఉన్నాయి. కారణం ఏదైనా నిందితుడు మారుతీ రావు చేసింది ముమ్మాటికీ తప్పేనన్నది అందరు ముక్తకంఠంతో చెబుతున్న మాట. ఇందులో మరో వాదనకు తావు లేదు. ఈ ఇష్యూ గురించే సోషల్ మీడియా మొదటి రోజు నుంచే అట్టుడికిపోతోంది. ఇందులో ప్రణయ్ అమృతల పట్ల తీవ్రమైన సానుభూతి ఉన్న వాళ్ళతో పాటు హంతకుడిగా నేరం ఒప్పుకున్న మారుతీ రావు వైపు కొందరు వకాల్తా పుచ్చుకోవడం విశేషం.

ఇత‌ర దేశాల‌క‌న్నా మ‌న‌దేశంలో కుంభ‌కోణాలు చేసి వేల‌కోట్లు దండుకోవ‌చ్చ‌ని నిరూపిస్తున్నారు ఆర్ధిక నేర‌గాళ్లు. ఇప్ప‌టికే ప‌లు బ్యాంకుల్లో వేల‌కోట్ల కుంభ‌కోణాలు జ‌రుగుతున్న‌ట్లు ఆధారాలు వెలుగులోకి వ‌స్తున్న క‌ళ్లున్న గుడ్డోడిలా వ్వ‌వ‌హ‌రిస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు.  

లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా 9 వేల కోట్ల రూపాయల మేరకు బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాల‌కు చెక్కేశాడు. మాల్యాకు రుణాలిచ్చిన బ్యాంకులు ఆయ‌న్ని స్వ‌దేశానికి తీసుకువ‌చ్చేలా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. ప‌లుకోర్టుల్లో కేసులు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

YOU MAY LIKE