అతి తక్కువ కాలంలో ఇమేజ్ ని అమాంతం పెంచుకున్న హీరోల్లో నానిది ప్రత్యేక స్థానం. న్యాచురల్ స్టార్ అంటారు కాని బాక్స్ ఆఫీస్ బాషలో అంతకు మించే ఎదిగిన నాని కొత్త సినిమా కృష్ణార్జున యుద్ధం ఈ రోజు విడుదలైంది. నాని సినిమాలకు ఎప్పుడూ ఉండే తరహాలోనే దీని మీద భారీ హైప్ ఏమి లేదు. ఇతని గత సినిమాల మాదిరే బాగుండొచ్చు అనే ప్రీ ఒపీనియన్ ఆల్రెడీ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ఫాన్స్ లో కూడా బలంగా నాటుకుపోయింది కాబట్టి ఓపెనింగ్స్ పరంగా లోటు లేకుండా గడిచిపోతోంది. దానికి తోడు నాని డ్యూయల్ రోల్ అనే కాన్సెప్ట్ ఆసక్తిని ఇంకాస్త పెంచింది.

యూత్ హీరో నితిన్ పాతికవ సినిమాగా కన్నా పవన్ కళ్యాణ్ నిర్మాతగా త్రివిక్రమ్ కథకుడిగా చేస్తున్న మూవీగా చల్ మోహనరంగా ముందు నుంచి ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ దాకా ఇది పూర్తిగా యూత్ బేస్డ్ లవ్ స్టొరీ అని స్పష్టంగా చెప్పేశారు కాబట్టి ఓపెనింగ్స్ కూడా వాళ్ళతోనే నిండిపోయాయి. లై ఫలితం పెద్ద షాక్ ఇచ్చిన నేపధ్యంలో ఎటువంటి ప్రయోగాల జోలికి పోకుండా తనకు అచ్చి వచ్చిన తన బాడీ లాంగ్వేజ్ కు సూట్ అయ్యే సాఫ్ట్ ఎంటర్ టైనింగ్ స్టోరీస్ వైపు యు టర్న్ తీసుకుని నితిన్ చేసిన మూవీ చల్ మోహనరంగా.

ధృవ తర్వాత ఏడాది పైగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా కాబట్టి రంగస్థలంపై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. గ్రామీణ నేపధ్యంలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు ఎవరూ చేయకపోవడం కూడా దీనికి పెద్ద ప్లస్ గా మారింది. రామ్ చరణ్ గెటప్, సమంతా మేకోవర్,మూవీకి సంబంధించిన విజువల్స్ అన్ని దీని మీద ఆసక్తి పెరుగుతూపోయేలా చేసాయి. దాని తోడు మాస్ ని మెప్పించే సినిమా ఏది ఈ ఏడాది ఇప్పటి దాకా రాకపోవడం కుడా రంగస్థలంకు కలిసి వచ్చింది. మరి ఇన్నేసి అంచనాలు అందుకునేలా రంగస్థలం ఉందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

నందమూరి హీరోలలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత కుదురుగా కెరీర్ సెట్ చేసుకుందామని ప్రయత్నిస్తున్న కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎమెల్యే.  ఓపెనింగ్స్ పరంగా క్రౌడ్ పుల్లర్ కాకపోయినా మౌత్ పబ్లిసిటీతో సినిమా బాగుంది అనిపిస్తే చాలు మెల్లగా నిర్మాతను సేఫ్ జోన్ తీసుకొచ్చె కెపాసిటీ ఉన్న హీరోగా కళ్యాణ్ రామ్ కు ఫాన్స్ లో మంచి అభిప్రాయం ఉంది. రాజకీయ వాతావరణం బాగా వేడిగా ఉన్న తరుణంలో పొలిటికల్ టచ్ ఉన్న టైటిల్ తో వస్తున్న ఈ మూవీ మీద మాస్ జనాలు బాగానే అంచనాలు పెట్టుకున్నారు. మరి వాటిని అందుకునేలా ఎమెల్యే మెజారిటీ తో గెలిచాడా లేక డిపాజిట్ కూడా దక్కలేక మరో ఎన్నికల కోసం సిద్ధపడతాడా రివ్యూలో చూద్దాం 

తెలుగు సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తూనే ఉంది, ఈ నేపధ్యం లో ఈ మధ్య కాలం లో వచ్చిన చాలా చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి హిట్స్ ని అందుకున్నాయి. అలాగే చిన్న సినిమాల్లో పెద్ద సినిమాల్లో కంటే ఎక్కువ కంటెంట్ తో పాటు ఒక సామజిక అంశం కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం సమాజంలో ఎన్నో సమస్యల్లో చదువు కూడా ఒక సమస్యగా ఉంది. అయితే అసలు చదువు వల్ల పిల్లలు ఎం కోల్పోతున్నారు, చదువు లేకున్నా గాని ఒక మనిషి హ్యాపీ గా సంతోషంగా ఉండగలడు అనే పాయింట్ తో వస్తున్న సినిమా "నీది నాదే ఒకే కథ". మరి వేణు ఉడుగుల దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరో గా ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో రివ్యూ లో చూద్దాం.

"ఐతే" ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల అందరికి చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన మూవీ ఏ గుర్తువస్తుంది. ఎందుకంటే ఆ మూవీ అప్పట్లోనే చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది. అందరూ కొత్త వాళ్ళని పెట్టి చంద్ర శేఖర్ యేలేటి తీసిన ఈ సినిమాకి ఇప్పటికి అభిమానులు ఉన్నారు. అయితే చాలా కాలం తరువాత ఈ మూవీ కి "ఐతే 2.0" రీలోడెడ్ అని సీక్వెల్ వచ్చింది, కాని ఈ సీక్వెల్ మూవీ ని రాజ్ మదిరాజు గారు డైరెక్ట్ చేసారు. "ఐతే" మొదటి భాగం లో ఉన్నట్టే రెండో భాగం లో కూడా అందరూ కొత్తవాళ్ళే ఉన్నారు. మరి "ఐతే" మూవీ కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ "ఐతే" రేంజ్ లో ఆకట్టుకుందో లేదో మనం రివ్యూ లో చూద్దాం.

హ్యాపీ డేస్ లాంటి అవుట్ అండ్ అవుట్ కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టొరీతో పరిచయమై మంచి పేరు తెచ్చుకున్న హీరో నిఖిల్ మళ్ళి ఆ తర్వాత అదే జానర్ లో సినిమా చేయలేకపోయాడు. ఇంత గ్యాప్ తర్వాత అదే పనిగా కోరి మరీ చేసిన రిమేక్ మూవీ కిరాక్ పార్టీ. కన్నడలో రెండేళ్ళ క్రితం వచ్చిన కిరిక్ పార్టీకి ఇది తెలుగు రూపం. ప్రమోషన్ లో దీని గురించి చాలా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వచ్చిన నిఖిల్ ఇది తనకు మరో మైల్ స్టోన్ అవుతుందనే నమ్మకాన్ని పదే పదే వ్యక్తం చేసాడు. అంచనాలు భీభత్సంగా లేకపోయినా గత నెల రోజులకు పైగా తొలిప్రేమ తర్వాత యూత్ ని అలరించిన సినిమా ఏది లేకపోవడం కిరాక్ పార్టీకి ప్లస్ గా మారింది.

న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి తీసిన సినిమాగా అ!! ముందు నుంచి చాలా ప్రత్యేకమైన అంచనాలు మోసుకుంటూ వచ్చింది. పోస్టర్ల నుంచి ట్రైలర్ దాకా ఇదేమి రెగ్యులర్ ఫార్మట్ లో ఉండే కమర్షియల్ సినిమా కాదనే స్పష్టత ముందు నుంచే ఇవ్వడంతో దానికి తగ్గట్టు ప్రేక్షకులు కూడా ప్రిపేర్ అవుతూ వచ్చారు. అసలు హీరో అంటూ లేకుండా కేవలం హీరొయిన్లతోనే ఇంత క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఈ మధ్య కాలంలో రాలేదనే చెప్పాలి.

తెలుగు లో సందీప్ కిషన్ కి హిట్టు పడి చాలా కాలం అయ్యింది. "నక్షత్రం" లాంటి డిసాస్టర్ తరువాత సందీప్ కిషన్ ని హీరో లాగ చాలా మంది మర్చిపోయారు. ఇక తెలుగు లో వర్క్ అవుట్ అయ్యేలా లేదు అని చెప్పి తమిళ్ లో సినిమాలు చేస్తున్నాడు సందీప్ కిషన్. కాని మళ్ళి ఒకసారి తన లక్ ని పరిక్షించుకుందాం అని చెప్పి ఘట్టమనేని వారసురాలు అయిన మంజుల దర్శకత్వంలో "మనసుకు నచ్చింది" అనే మూవీ చేసాడు సందీప్ కిషన్. చాలా కాలం తరువాత ఒక ఫీల్ గుడ్ లవ్ స్టొరీ లో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు సందీప్ కిషన్. మరి ఈ "మనసుకు నచ్చింది ప్రేక్షకుల మనసుకి నచ్చిందో లేదో తెలుసుకుందాం.

కథ

ఒకప్పుడు లవర్ బాయ్ గా యూత్ ఐకాన్ గా ఉన్న తరుణ్ అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ కు దూరమై బిజినెస్ లో పడిపోయాడు. గ్యాప్ వస్తే వచ్చిందిలే పెద్ద పెద్ద సీనియర్ హీరోలే రాగా లేనిది నేను వస్తే ఏంటి అనుకున్నాడో ఏమో ఇన్నేళ్ళ తర్వాత ఇది నా లవ్ స్టొరీతో మన ముందుకు వచ్చాడు తరుణ్. రమేష్ గోపి దర్శకత్వంలో ప్రకాష్ నిర్మించిన ఈ మూవీకి శ్రీనాద్ విజయ్ సంగీత దర్శకుడు.

ఫిదా ఇచ్చిన సక్సెస్ కిక్ తో జోష్ మీద ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దాని తరువాతి సినిమా హిట్ అయ్యే తీరాలి అనే లక్ష్యంతో చేసిన సినిమా తొలిప్రేమ. ఫిదా సక్సెస్ లో మేజర్ షేర్ సాయి పల్లవి తీసేసుకుంది కాబట్టి వరుణ్ తేజ్ తన పేరు మీద, తన వల్ల విజయం సాధించే మూవీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమాటకొస్తే ఫిదా కంటే ముందు వరుణ్ ఖాతాలో ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నప్పటికీ కమర్షియల్ గా ఇంకా తన స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ కు చూపించలేదు. ఈ నేపధ్యంలో వచ్చిన తొలిప్రేమపై టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. మరి వాటిని అందుకునే రేంజ్ లో ఉందో లేదో చూద్దాం 

నిర్మాణ సంస్థ: ల‌క్ష్మి ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌
సంగీతం: ఎస్.ఎస్.తమన్
ఛాయాగ్రహణం: సర్వేశ్ మురారి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్
నిర్మాత: డా. మోహన్ బాబు యమ్.
దర్శకత్వం: మదన్ రామిగాని
తారాగ‌ణం: మ‌ంచు మోహ‌న్ బాబు, మంచు విష్ణు, శ్రియా శ‌ర‌న్‌, నిఖిలా విమ‌ల్‌, అన‌సూయ‌, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు

నిర్మాత: సి.కళ్యాణ్‌
క‌థ‌నం, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.
కథ, మాటలు: శివ ఆకుల
ఛాయాగ్ర‌హ‌ణం: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌
సంగీతం: థమన్‌ 
సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా

సుమారు రెండేళ్ళ గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ సక్సెస్ తో తిరిగి ఫాంలోకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ నాలుగు నెలల వ్యవధిలోనే టచ్ చేసి చూడుతో వచ్చేసాడు. తనకు సమాంతరం కాని నాగశౌర్య ఛలోతో తప్ప పెద్ద పోటీ లేకుండానే బరిలో దిగిన ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ట్రైలర్ కొంచెం రొటీన్ గానే ఉంది అనే ఫీలింగ్ కలిగించినా మెప్పించే మ్యాటర్ సినిమాలో ఉండే ఉంటుంది అనే నమ్మకంతో ప్రేక్షకులు దీని కోసం ఎదురుచూసారు. జనవరిలో భాగమతి తప్ప మరీ గొప్పగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేకపోవడంతో ఫిబ్రవరిని స్టార్ట్ చేస్తున్న టచ్ చేసి చూడు మీద ట్రేడ్ వర్గాలు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాయి.

YOU MAY LIKE