నీర‌వ్ మోడీ రూ.11436కోట్ల కుంభ‌కోణం లో క‌థా - స్త్రీన్ ప్లే - డైర‌క్ష‌న్ ఎవ‌ర‌నేది  ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ముంబై కేంద్రంగా ప‌నిచేస్తున్న పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ లో  అవసరమైన రుణం పొందేందుకు హామీగా ఇచ్చే లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్(ఎల్ ఓయూ- ఏ దేశం నుండి అయినా సరుకును ఎగుమతి చేసుకునే వారికి దిగుమతి వారి తరుపు నుంచి ఇచ్చే గ్యారెంటీ  ) కావాలని  నీర‌వ్ సంబంధిత కంపెనీలు విజ్ఞప్తి చేశాయి.  దీనికి పీఎన్బీ బ్యాంక్ అధికారులు తమకు 100% క్యాష్ మార్జిన్ కావాలని కోరాయి.

యజమాని భార్యతో వివాహేతర సంబంధం.. ఆపై ఇద్దరు పరారీ.. కోపం పెంచుకున్న యజమాని తమ్ముడు.. వదిన ప్రియుడి కళ్లలో యాసిడ్.. ఇది సినిమా స్టోరీ కాదు. నిజంగా జ‌రిగింది. సినీ ఫక్కీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది బీహార్‌లో. ఆ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలోటెగ్‌హ్రా పోలీసు స్టేషన్ పరిధిలోని బరౌనీ గ్రామంలో.

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేశారంటే..అది శ‌త్రువైన మిత్రుడైన ఓ రేంజ్‌లో ఎదురుదాడిని ఎదుర్కోవాల్సిందే. అయితే అది కాస్తా త‌న దేశానికి చెందిన అత్యున్న సంస్థ‌ను సైతం టార్గెట్ చేసే స్థాయికి చేర‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కి విష‌యం ఏంటంటే...అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పార్క్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో ఉన్మాది నికోలస్ క్రూజ్ విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 17 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి పైగా విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. 

 జీఎస్టీ( గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌) వివాదం పై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్‌వ‌ర్మ సీసీఎస్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. జీఎస్టీ, మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచేలా వ్య‌వ‌హిరంచారంటూ ఆర్జీవీ పై కేసులు న‌మోదు అయ్యాయి. జ‌న‌వ‌రి 25న సైబ‌ర్  క్రైమ్ పోలీసులు ఐపీసీలోని 506, ఐటీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేసి ముంబైలో ఉన్న వ‌ర్మ‌కు నోటీసులు పంపించారు. విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సూచించారు.

త‌మిళ‌నాడులో ఉంటున్న తెలుగు యువ‌తిపై అత్యాచారం జ‌రిగింది. ఆపై ఆమెత‌ల‌పై రాడ్డుతో దాడి చేయండ‌తో తీవ్ర‌గాయాలైన బాధితురాలు ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతుంది. నిర్భ‌య ఘ‌ట‌న అనంతరం ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా ఇంకా వారి భ‌ద్ర‌త‌ను ప్ర‌శ్నార్థకంగానే ఉంది.  మ‌హిళ అనే ప‌దం విన‌బ‌డితే చాలు.. గుంట న‌క్క‌ల్లా పొంచి ఉండే కామాంధులు వారిపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు. అవ‌కాశం దొరికితే చాలు.. మ‌హిళ‌ల‌ను వేధింపుల‌కు గురి చేయడానికి రెడీ అవుతున్నారు.

ఉప్ప‌ల్ చిలుకా న‌గ‌ర్  న‌ర‌బ‌లి కేసులో పోలీసులు పురోగ‌తి సాధించారు. చంద్ర‌గ్ర‌హ‌ణం రోజు  చిలుకాన‌గ‌ర్ లో ముక్కు ప‌చ్చ‌లార‌ని పసిగుడ్డు ప్రాణం తీశారు. త‌ల‌ను న‌రికి ఓ మేడ‌పై వ‌దిలి మొండాన్ని క‌నిపించ‌కుండా చేశారు. అయితే మేడ‌పై బ‌ట్ట‌లు ఆరేసేందుకు వ‌చ్చిన ఓ మ‌హిళ‌కు న‌రికిన త‌ల ప్ర‌త్యేక్షమ‌వ్వ‌డంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న మల్కాజ్‌గిరి జోన్ డీసీపీ సీహెచ్ఆర్.  ఉమామ‌హేశ్వ‌ర శ‌ర్మ  ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ ద‌ర్యాప్తులో భాగంగా పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తూ  రాజ‌శేఖ‌ర్ (35), అత‌ని భార్య సునిత‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా వారి పై మృగాళ్ల వేధింపులు కొన‌సాగుతున్నాయి. నిర్భయపై అత్యాచార ఘటన దేశంలో సంచలనంగా మారినప్పటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాల ద్వారా మహిళలకు రక్షణ కల్పించే ఏర్పాట్లు చేశారు. అయినా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు ఆగడం లేదు. తాజాగా ఓ ఎనిమిది నెలల చిన్నారిని ఓ మృగాడు హత్యాచారం చేసిన సంఘటన డిల్లీలో చోటుచేసుకుంది.

అధికారం చేతిలో లేన‌ప్పుడు చెప్పే మాట‌ల‌కు.. అధికారం చేతికి వ‌చ్చాక చేసే ప‌నుల‌కు అస్స‌లు సంబంధం ఉండ‌దు. ఈ ల‌క్ష‌ణం చాలామంది నేత‌ల్లో ఉండొచ్చు కానీ త‌న‌లో  మాత్రం అస్స‌లు ఉండ‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన ఆయ‌న‌.. తాను జీతం తీసుకోకుండా ప‌ని చేస్తాన‌ని చెప్పాడు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో చాలామంది చెప్పే హామీల‌కు త‌గ్గ‌ట్లే.. ట్రంప్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తున్నాడ‌ని ఫీలైనోళ్లు లేక‌పోలేదు.

భార‌త్ లో ప‌కోడీలు ఊపందుకున్నాయి. హైద‌ర‌బాద్ గ‌ళ్లీ నుంచి ఢిల్లీ రాజ‌కీయ నాయ‌కుల దాకా అంద‌రూ ప‌కోడీల మంత్ర‌మే జ‌పిస్తున్నారు. దీంతో నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు అంతంత్ర మాత్రంగానే ఉన్న ప‌కోడీల బిజినెస్ ఊపందుకుందని న‌గ‌ర‌వాసులు గుస‌గుస‌లాడుతున్నారు. దీనికి తోడు ఓ యువ‌కుడు ప‌కోడీల బిజినెస్ పెట్టుకోవ‌డానికి లోన్ కావాలంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి  లేఖ రాయ‌డం మ‌రోసారి ప‌కోడి పాలిటిక్స్ తెర‌పైకి వ‌చ్చాయి. 

ఇరాన్ సంచలన ఆరోపణ చేసింది. తమ దేశంపై గూఢచర్యానికి బల్లులు, ఊసరవెల్లులను కూడా వాడుతున్నారని ప్రత్యర్థి దేశాలపై కామెంట్లు చేసింది. ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్, ప్రస్తుత సీనియర్ సలహాదారు.. హసన్ ఫురుజబది ఈ ఆరోపణలు చేశారు. తమ దేశంలో అణ్వస్త్ర సంబంధ కార్యక్రమాలు తెలుసుకునేందుకు కొన్ని దేశాలు ఈ పని చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఈ మధ్యే.. కొందరు పర్యావరణ వేత్తలను అరెస్ట్ చేయడానికి సంబంధించిన వ్యవహారంపై స్పందిస్తూ.. ఆయన ఈ విషయాన్ని చెప్పారు.

ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లు రైల్వే స్టేష‌న్ల‌లో కండోమ్ లు పంచ‌డం చ‌ర్చాంశనీయ‌మైంది. ప్రేమికులు అతిప‌విత్రంగా భావించే ఫిబ్ర‌వ‌రి 14న  ముంబై ఎహెచ్ ఎఫ్ జ్యోతీ అనే ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ వాలంటీర్లు వాషి రైల్వేష్టేష‌న్ లో యువ‌తీ , యువ‌కుల‌కు ఏడువేల కండోమ్ ల‌ను ఉచితంగా పంపిణీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌త్యేకించి వాలెంటైన్స్ డే రోజు కండోమ్ లు పంపిణీ చేయ‌డం పై విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాతాము చాలా మంది హెచ్ఐవీ తో బాధ‌ప‌డుతున్న వారిని చూస్తున్నామ‌ని అలాంటి భ‌యంక‌ర‌మైన వ్యాధి రాకుండా ఉండేలా  ఉచిత‌ కండోమ్ ల‌ను పంచుతున్న‌ట్లు ట్ర‌స్ట్ వాలంటీర్లు చెబ‌తున్నారు.

న‌గ‌రంలో ట్రాఫిక్ క‌ష్టాల నుంచి ప్ర‌యాణికుల్ని గ‌ట్టెంక్కించేందుకు ఎల్ ఆండ్ టీ నిర్మాణంలో  మెట్రో రైలు వ‌చ్చిన విష‌యం తెలిసింది. మెట్రో రైలు ప్రారంభంలో రోజుకు ల‌క్ష‌మందికి పైగా న‌గ‌ర వాసులు ప్ర‌యాణించారు. కానీ రోజులు గ‌డిచే కొద్ది మెట్రో రైలులో ప్ర‌యాణించే వారు క‌రువ‌య్యారు. మొద‌ట్లో జాయ్ రైడ్స్ ను ఎంజాయ్ చేసిన ప్ర‌యాణికులు ఇప్పుడు లేక‌పోవ‌డం మెట్రో అధికారుల్ని విస్మ‌యానికి గురిచేస్తుంది. ప్రారంభ‌మై రెండు నెల‌ల‌కే ఇలాంటి పరిస్థితి ఎందుకు వ‌చ్చింది అనే విష‌యంపై ఆరా తీస్తే  అనేక కార‌ణాలు ఉన్న‌ట్లు ప్ర‌యాణికులు చెబుతున్నారు.  

అదినోరా లేక తాటి మ‌ట్టనా అని తిడుతున్నారు  ఫిలిప్పీన్స్ ప్ర‌జ‌లు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో త‌ల‌దూర్చి ర‌చ్చ‌రచ్చ చేసి ఆ దేశ అధ్య‌క్షుడు  రోడ్రిగ్‌ డుటెర్టె మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచేలా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ఇటీవ‌ల జ‌రిగిన మాజీ తిరుగుబాటు దారుల స‌మావేశంలో  క‌మ్యూనిస్ట్ రెబ‌ల్స్ మ‌హిళ‌ల్ని ఉద్దేశిస్తూ  చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌కలం సృష్టిస్తున్నాయి.

ఇటీవల తెలంగాణలో సంచలనం రేపిన పోలీసుల అక్రమ సంబంధం వ్యవహారంలో ఆసక్తిదాయకమైన వార్తలు వస్తున్నాయి.  ఈ వ్యవహారంలో సునీతా రెడ్డి అనే ఎస్సై, మల్లికార్జున రెడ్డి అనే మరో సీఐలు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్యనా అక్రమసంబంధం ఉందని సునీతా రెడ్డి భర్త ఆరోపించాడు. వాళ్లిద్దరి సంబంధానికి సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టాడు. దీంతో పోలీసు శాఖ వాళ్లిద్దరినీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో.. ఈ కేసుపై విచారణ కూడా సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

నేను జ‌ర్న‌లిజంలో ప‌ట్ట భ‌ద్రుణ్ని కొన్నిటీవీ ఛాన‌ళ్ల‌లో చేసిన అనుభ‌వం ఉంది. ప‌నిలో ప‌నిగా అవ‌స‌రాల రిత్యా   వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్. జ‌గ‌న్ కు  నేను హార్డ్ కోర్ ఫ్యాన్ ను అందుకే సాక్షి టీవీలో జాబ్ ఉందంటే రిఫ‌రెన్స్ తో అక్క‌డికి వెళ్లా అది బంజారాహిల్స్ రోడ్‌నెం.1 జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్  సాక్షి ఆఫీస్ చూడ‌టానికి కార్పొరేట్ ఆఫీస్ ను త‌ల ద‌న్నేలా ఉండే అద్దాల మేడ‌ చుట్ట‌ప‌క్క‌ల వాతావ‌ర‌ణం ఆహ్లాద‌క‌రంగా ఉంది ఎప్ప‌టి నుంచి సాక్షిలో ఉద్యోగం చేయాలే కోరిక అందుకే నా క‌ల‌ల సామ్రాజ్యంలోకి అడుగుపెట్టినంత క‌లిగింది.

YOU MAY LIKE