అమెజాన్ ఓనర్ కు ఒక్క రోజు నష్టం రూ. 67 వేల కోట్లు

Updated By VankayaFri, 10/12/2018 - 14:55
Amazon CEO Jeff Bezos

అమెరికా - చైనాల మధ్య వాణిజ్య వివాదం ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసింది. అపర కుబేరులు భారీగా నష్టపోయారు. ఒక్క రోజులో  500 మంది సంపన్నులు రూ.7.3 లక్షల కోట్లు పోగొట్టుకున్నారని అంచనా. వీరిలో ఎక్కువగా ప్రభావితం చేసేంది మాత్రం అమెజాన్ ఓనర్ కే.

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపాదన వేల కోట్లలో ఉంటుంది.  ఇతను ఒక్క రోజులో ఎంత డబ్బు పోగొట్టుకున్నాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అవును అక్షరాల రూ.67 వేల కోట్లు. అవును చైనాతో వాణిజ్య యుద్ధం దరిమిలా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికా మార్కెట్ కుదేలయ్యింది. దీంతో అమెరికాలోని అన్ని కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. అమేజాన్ జెఫ్ బెజోస్ సంపాదన కూడా  ఒక్కరోజులోనే రూ.67 వేల కోట్లు కొట్టుకుపోయింది.

దీనంతటికి కారణం ప్రపంచ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవటమేనని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య వివాదాలు అంతకంతకు పెరుగుతున్నాయి. వీటి ప్రభావం ప్రపంచ మార్కెట్ మీద ఎక్కువగా పడింది. ఈ వివాదం అంతకంతకు పెరిగితే మరింత నష్టం చవిచూడాల్సి వస్తుందని, గురువారం జరిగిన నష్టమే ఉదాహరణ అని చెబుతున్నారు నిపుణులు. ఒక్క రోజులో రూ.లక్ష కోట్లు ఆవిరైపోవడం మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. భారత్ మార్కెప్ పై కూడా ఈ ప్రభావం పడుతుందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE