హెడెన్ తలపై తమిళనాడు మ్యాప్..ఎలా..?

Updated By VankayaWed, 10/10/2018 - 18:17
Matthew Hayden

ఇల్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే ..చుట్టుకాల్చుకోవ‌డానికి నిప్పు దొర‌క‌లేద‌ని మ‌రొక‌డు ఏడ్చాడంట అలా ఉంది సౌతాఫ్రికా మాజీ క్రికెట‌ర్ జాంటిరోడ్స్ పోలిక. 

కొద్దిరోజుల క్రితం ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ మాథ్యూ హెడెన్ రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. ఈ ప్ర‌మాదంలో అత‌డికి తీవ్ర‌గాయాలు కాగా..హెడెన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలో నెట్టింట్లో వైర‌ల్ అయ్యాయి. దీంతో ప‌లువురు క్రికెట‌ర్లు, అభిమానులు గాయం నుంచి హెడెన్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు. జాంటీ రోడ్స్ కూడా అలాగే కాస్త విచిత్రంగా స్పందించాడు. 

హెడెన్ తలపై వున్న గాయం అచ్చం తమిళనాడు మ్యాప్ ను పోలి ఉందంటూ జాంటీ రోడ్స్ తెలిపాడు.హెడెన్ తలపై తమిళనాడు మ్యాప్ ను వేసుకున్నావా? తమిళనాడు పై నీకున్న ప్రేమ ఎలాంటిదో తెలుస్తుంది. నిన్ను అనుసరించి చాలా మంది ఇక తమిళనాడు మ్యాప్ టాటూలు వేసుకునే అవకాశం ఉంది అంటూ కామెంట్ చేశాడు. జాంటీ రోడ్స్ కామెంట్ల‌పై ప‌లువురు నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. 

స్వ‌త‌హాగా హెడెన్ ఐపీఎల్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ హెడెన్  తమిళనాడు జట్టు జట్టుపై తన ప్రేమను చాటుకున్నాడు అని అర్థం వచ్చేలా రోడ్స్  కామెంట్ చేశాడు. దీనిపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వెలువడుతోంది.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE