మాల్యా ఆస్తులు గోవిందా

Updated By VankayaFri, 10/12/2018 - 13:11
Vijay Mallya

ఆర్ధిక నేర‌గాడు విజ‌య్ మాల్యాకు ఎదురు దెబ్బ త‌గిలింది. బెంగ‌ళూరుకు చెందిన పోలీసులు మాల్యా ఆస్థుల్ని అటాచ్ చేసేందుకు ఢిల్లీ కోర్ట్ ను  అనుమ‌తి కోరారు. ఈ అనుమ‌తిలో భాగంగా మాల్యాకు ఎన్నిఆస్తులున్నాయి. ఎక్క‌డున్నాయి అనే సంబంధింత వివ‌రాల‌తో ఓ నివేదిక త‌యారు చేయాల‌ని కోర్టు ఆదేశించింది. కోర్ట్ ఆదేశాల ప్ర‌కారం పోలీసులు మాల్యాకు మొత్తం 159ఆస్తులు ఉన్న‌ట్లు గుర్తించారు.

ఈ ఆస్తుల‌పై విచారించిన ఢిల్లీ కోర్ట్  మాల్యా ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ (ఫెరా) ఉల్లంఘించార‌ని, త‌క్ష‌ణ‌మే బెంగ‌ళూరులో ఉన్న ఆస్తుల్ని అటాచ్ చేసుకోవాల‌ని  సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్ట్ నిర్ధేశించిన గ‌డువు స‌రిపోద‌ని,  అస్తుల అటాచ్‌కు పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేయాలని బెంగళూరు పోలీసులు, ఈడీ తరఫు న్యాయవాది ఎన్‌కే మట్టా, సంవేదన వర్మ కోరారు.  

కాగా  భార‌త్ కు చెందిన‌ 13 బ్యాంకుల్లో రూ.9వేల కోట్లు అప్పుతీసుకొని ఎగ‌నామం పెట్టి  విదేశాల‌కు చెక్కేశాడు. దీంతో ఆ 13 బ్యాంకులు మాల్యా ఆస్తులను స్తంభింపజేయాల‌ని కోరుతూ యూకే కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాయి. అంతేకాదు మాల్యాకు ఇచ్చిన మొత్తాన్ని ముక్కుపిండి వ‌సూలు చేసేలా చుక్క‌లు చూపిస్తున్నాయి.  ఈ నేప‌థ్యంలో మాల్య ఆస్తుల్ని జ‌ప్తు చేసేందుకు అధికారులు పావులు క‌దుపుతున్నారు.  
 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE