శబరిమలలోకి మహిళలు.. సంచలన రివ్యూ

Updated By VankayaMon, 10/08/2018 - 16:57
Women entry in Sabarimala temple: Review petition filed in Supreme court

శబరిమలలో మహిళల ప్రవేశం మరో కొత్త మలుపు తిరిగింది.. సుప్రీం కోర్టు ఇటీవలే శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపై పాజిటివ్ గా స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్ ఏకంగా మహిళలకు ప్రవేశం కల్పిస్తామని.. ఇందుకోసం మహిళా పోలీసులను కూడా నియమిస్తామని వెల్లడించారు. 

కేరళ సీఎం మహిళల ప్రవేశానికి సై అనడంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, సంప్రదాయ భక్తులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. మహిళల ప్రవేశాన్ని రద్దు చేయాలని హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. కేరళలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించవద్దంటూ ఏకంగా ఇప్పుడు అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు చేసే పూజారులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీం కోర్టులో వ్యతిరేకంగా పిటీషన్ వేస్తేనే చర్చలు జరుపుతామని.. అంతవరకూ మహిళలను అనుమతించమని మొండికేశారు.ఇలా కేరళలో అన్ని పక్షాలు నిరసనలతో హోరెత్తిస్తుండగా.. కేరళ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.

తాజాగా సుప్రీం కోర్టులో అఖిల భారతీయ అయప్ప భక్తుల సంఘం పిటీషన్ వేసింది. కేరళలోని సంప్రదాయ అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశాన్ని రద్దు చేయాలని.. సుప్రీం తీర్పును పున: సమీక్షించాలని పిటీషన్ లో కోరింది. కేరళతోపాటు దేశవ్యాప్తంగా మహిళల ప్రవేశంపై వచ్చిన వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోవాలని రివ్యూ పిటీషన్ వేసింది. అయ్యప్ప ఆలయ సంప్రదాయం ప్రకారం నెలసరి రుతుక్రమం అయ్యే మహిళలు ఆలయంలో ప్రవేశించరాదని.. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని పిటీషన్ లో కోరారు. 

ఈ రివ్యూ పిటీషన్ తో శబరిమల వివాదం కొత్త మలుపు తిరిగింది. ప్రజాభీష్టం మేరకు అయ్యప్ప భక్తల పిటీషన్ ను సుప్రీం విచారణకు స్వీకరిస్తుందా.. సంప్రదాయాలకు విలువనిస్తుందా.? లేక తన తీర్పును అమలు చేస్తుందా అన్నది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE