శృంగార‌మం అంటే ప‌డిచ‌స్తున్నార‌ట‌

Updated By VankayaSun, 10/07/2018 - 10:58
Health Tips

ద‌క్షిణ భార‌త దేశంలో కంటే ఉత్త‌ర భార‌త‌దేశానికి చెందిన 15 నుండి 19ఏళ్ల వ‌య‌సున్న యువ‌త సెక్స్ పాల్గొంటున్న‌ట్లు జాతీయ ఆరోగ్య సంస్థ‌లు తెలిపాయి. మ‌న‌దేశంలో యువ‌త‌పై శృంగారం ఎటువంటి ప్ర‌భావాన్ని చూపిస్తుంది. స్త్రీలు - పురుషుల మ‌ధ్య శృంగార సంబంధాలు ఎలా ఉన్నాయి..? 

తొలిసారి సెక్స్ లో ఎవ‌రు పాల్గొంటున్నారు అనే విష‌యాల‌పై స‌ర్వే నిర్వహించగా..ఆ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఇందులో భాగంగా 2015-16 సంవ‌త్స‌రానికి గాను  దేశవ్యాప్తంగా జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ మ‌న‌దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో స‌ర్వే నిర్వ‌హించింది. ఆ స‌ర్వేలో 15 నుంచి 19 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న వారిని ప్ర‌శ్నిస్తే తొలిసారి సెక్స్ పాల్గొనేది అమ్మాయిలేన‌ని..అబ్బాయిలు లేటుగా సెక్స్ సుఖాన్ని అనుభ‌విస్తున్న‌ట్లు చెప్పారు. ఇక అమ్మాయిల‌కు  యుక్తవయస్సు రాగానే  వివాహాలు చేయడం కూడ ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు.

పెళ్లికి ముందుకు సెక్స్ లో పాల్గొన్నవారిపై స‌ర్వే నిర్వ‌హిస్తే  15-24 ఏళ్ల మధ్య నున్న 11% మంది ఒంటరి పురుషులు, 2% మంది ఒంటరి మహిళలు తాము సెక్స్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. పురుషుల్లో అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌లో 21.1% మంది, మధ్యప్రదేశ్‌లో 20.7% మంది , హర్యానా, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్ కు చెందిన యువ‌త ముందంజ‌లో ఉన్న‌ట్లు తేలింది. ఇక పెళ్లిచేసుకునే స‌మ‌యానికి  నాలుగు వారాలకు ముందు నుంచి సెక్స్‌లో పాల్గొంటున్న‌ట్లు  జాతీయ స్థాయిలో 47% మంది, పురుషుల్లో 48% మంది చెప్పారు. 

గ‌ర్ల్ ఫ్రెండ్ తో , బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గొనే వారు 60శాతానికి పైగా వ్య‌భిచార కేంద్రాల్ని ఆశ్ర‌యించేవారు 20శాతం మంది  పురుషులున్నారు. హర్యానా, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలోని ఒంటరిగా ఉండే 5శాతం పురుషులు శృంగారంలో పాల్గొంటున్న‌ట్లు తేలింది. ఒంటరి మహిళల్లో కర్ణాటకలో 2 శాతం మంది, గుజరాత్‌లో 1.9% మంది సెక్స్ లో పాల్గొంటున్న‌ట్లు స‌ర్వేలో తేట‌తెల్ల‌మైంది.  

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE